
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Small Savings Schemes: కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక చిన్న పొదుపు పథకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రతిఏడాది ఈ పథకాల వడ్డీరేట్లను మార్చుతూ వస్తుంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసిక ఏడాదికి గాను చిన్న పొదుపులపై వడ్డీ రేట్లను కేంద్రం తాజాగా ప్రకటించింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, వంటి పలు చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లలో ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. జులై 1, 2026 నుంచి ప్రారంభమయ్యే ప్రస్తుత ఆర్థిక ఏడాది రెండవ త్రైమాసికానికిగాను ఈ రేట్లు యథాతథంగా ఉంచారు. ఈ రేట్లలో ఎలాంటి మార్పు లేకపోవడం ఇది వరుసగా 9వ ఏడాది అని చెప్పాలి.
ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఒక నోటిఫికేషన్ ప్రకారం.. 2026-27 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికానికి జూలై 1, 2026 నుండి సెప్టెంబర్ 30, 2026 వరకు విధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి నోటిఫై చేసిన విధంగానే కొనసాగుతాయి. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. సుకన్య సమృద్ధి యోజన కింద డిపాజిట్లపై 8.2 శాతం వడ్డీ కొనసాగుతుంది. అయితే మూడేళ్ల టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 7.1 శాతంగానే ఉంచారు. ప్రజాదరణ పొందిన పొదుపు పథకం పీపీఎఫ్‌పై వడ్డీ రేటు 7.1 శాతంగా యథాతథంగా ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ డిపాజిట్ స్కీమ్‌పై రేటు 4 శాతంగా యథాతథంగా ఉంటుంది. కిసాన్ వికాస్ పత్రపై వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంటుంది. ఇందులో చేసిన పెట్టుబడులు 115 నెలల్లో మెచ్యూర్ అవుతాయి.
అదే సమయంలో.. జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ పై వడ్డీ రేటు 7.7 శాతంగానే కొనసాగుతుంది.మొదటి త్రైమాసికం మాదిరిగానే, రెండవ త్రైమాసికంలో కూడా పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం పెట్టుబడిదారులకు 7.4 శాతం వడ్డీ లభిస్తుంది.
2023-24 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో ప్రభుత్వం చివరిసారిగా కొన్ని మార్పులు చేసినప్పటి నుండి, ప్రధానంగా తపాలా కార్యాలయాలు, బ్యాంకులచే నిర్వహించే ఈ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను వరుసగా తొమ్మిదవ సారి కూడా యథాతథంగా ఉంచారు.
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.