
ఓ! సుకుమారి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. తిరువీర్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ గ్రామీణ ప్రేమకథా చిత్రాన్ని డైరెక్టర్ భరత్ దర్శన్...
ఓ! సుకుమారి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. తిరువీర్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ గ్రామీణ ప్రేమకథా చిత్రాన్ని డైరెక్టర్ భరత్ దర్శన్ తెరకెక్కిస్తున్నారు. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 17న థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ఫస్ట్ సాంగ్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకోవడంతో సినిమాపై ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. గతంలో శివం భజే సినిమాను నిర్మించిన ఈ నిర్మాణ సంస్థ మరో భిన్నమైన కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పచ్చని ప్రకృతి, నల్లని మేఘాలతో నిండిన ఆకాశం మధ్య ఫాంటసీ టచ్‌తో రూపొందించిన విజువల్ సినిమాలోని రొమాంటిక్ ఎలిమెంట్‌ను హైలైట్ చేస్తోంది. సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఐశ్వర్య రాజేష్ తన చేయిని తిరు వీర్ వైపు చాచగా, అతను చిరునవ్వుతో గాల్లో తేలియాడుతున్నట్టుగా కనిపించే కాన్సెప్ట్ పోస్టర్‌కు ప్రత్యేకత తీసుకొచ్చింది. ఇద్దరి చేతివేళ్ల మధ్య మెరుపు రేఖను చూపించడం ద్వారా ప్రేమ, విధి, ఫాంటసీ అంశాలు కథలో కీలక పాత్ర పోషించనున్నాయనే సంకేతాన్ని మేకర్స్ ఇచ్చారు.
ఈ సినిమాకు టి. భరత్ మంచిరాజు సంగీతం అందిస్తుండగా, మురళీధర్ గౌడ్, విష్ణు ఓయ్, ఝాన్సీ, అమని, ఆనంద్కోట జయరామ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రిలీజ్‌కు ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రచార కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని చిత్రబృందం భావిస్తోంది. గ్రామీణ నేపథ్యం, ప్రేమ, ఫాంటసీ అంశాల మేళవింపుతో రూపొందుతున్న ఓ! సుకుమారి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.