
సంఖ్యాశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీ, పుట్టిన నెల ఆ వ్యక్తిపై ప్రత్యేక ప్రభావం చూపుతుంది అంటారు. అయితే కొంత మంది తమ రాశి ప్రకారం తమ జాతకం తెలుసుకుంటే, మరి కొంత మంది
మాత్రం న్యూమరాలజీ ప్రకారం, వ్యక్తి పుట్టిన నెల, తేదీని బట్టి తమ ఫ్యూచర్ గురించి తెలుసుకుంటారు. మనం జూలై నెలలో పుట్టిన వారి ఫ్యూచర్ గురించి తెలుసుకుందాం.
జూలై నెలలో జన్మించిన వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంతే కాకుండా వీరు తమ కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. చదువు విషయంలో కూడా చాలా ముందు ఉంటారు. వీరిలో పోటీతత్వం చాలా ఎక్కువగా, చాలా కష్టపడతారు, అలాగే మంచి ఫలితాలను పొందుతారు.
ఈనెలలో జన్మించిన వారు కుటుంబానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. కుటుంబ బాధ్యతలు పంచుకుంటారు. అలాగే వీరికి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ఎంత ఇష్టపడుతారో, అంతే నమ్మకంగా ఉంటారు. కానీ ఒకసారి ఎవరు అయినా మోసం చేస్తే మళ్లీ వారి పేరు పలకడానికి కూడా అంతగా ఇష్టం చూపరు. స్నేహితులపై చాలా శ్రద్ధ , ఇష్టం ఉంటుంది.
అంతే కాకుండా వీరికి వీరి ఫ్యూచర్ పై కూడా వీరికి చాలా నమ్మకం ఉంటుంది. మంచి పొజిషన్లో ఉంటారు. అన్నివిధాలుగా వీరికి కలిసి వస్తుంది. చిన్న వయసులోనే మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. చాలా త్వరగా సెటిల్ అవుతారు. వీరిలో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉండటం వలన అనుకున్నది సాధించుకుంటారు. జీవితంలో అందరికంటే చాలా గొప్పగా బతుకుతారు.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు