
లండన్: ప్రపంచ చాంపియన్ జర్మనీ జట్టును... ఒలింపిక్ చాంపియన్ నెదర్లాండ్స్ జట్టును ఓడించిన ఉత్సాహంలో ఉన్న భారత పురుషుల హాకీ జట్టు తన కీలక పోరుకు సిద్ధమైంది.
Jun 23 2026 6:08 AM | Updated on Jun 23 2026 6:09 AM
లండన్: ప్రపంచ చాంపియన్ జర్మనీ జట్టును... ఒలింపిక్ చాంపియన్ నెదర్లాండ్స్ జట్టును ఓడించిన ఉత్సాహంలో ఉన్న భారత పురుషుల హాకీ జట్టు తన కీలక పోరుకు సిద్ధమైంది. ప్రొ లీగ్ 2025–2026 సీజన్లో భాగంగా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తోనూ భారత్ రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ఇరు జట్ల మధ్య నేడు తొలి మ్యాచ్ జరగనుండగా... రెండో మ్యాచ్‌ను శుక్రవారం నిర్వహిస్తారు.
2024లో చైనా వేదికగా జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో చివరిసారి భారత్, పాక్ ముఖాముఖిగా తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్ 2–1తో గెలిచింది. ప్రస్తుత యూరోప్ అంచె ప్రొ లీగ్‌లో భారత్ తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న జట్లను ఓడించి జోరు మీదుంది. జుగ్రాజ్ సింగ్, మన్దీప్ సింగ్, శిలానంద్ లాక్రా, అభిషేక్ తమకు లభించిన అవకాశాలను గోల్స్‌గా మలుస్తున్నారు.
మరోవైపు పాకిస్తాన్ జట్టు ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఒక్క విజయాన్ని కూడా సాధించలేకపోయింది. కొన్నేళ్లుగా అంతర్జాతీయ హాకీలో పాకిస్తాన్‌పై భారత్‌దే పైచేయిగా ఉంది. గత పదేళ్లలో ఈ రెండు జట్ల మధ్య 17 మ్యాచ్‌లు జరగ్గా... 15 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది. మరో రెండు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. ప్రొ లీగ్‌లోనూ పాక్‌పై తమ విజయపరంపరను కొనసాగించాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగనుంది.
తొమ్మిది జట్ల మధ్య జరుగుతున్న ప్రస్తుత ప్రొ లీగ్ సీజన్లో భారత్ 10 పాయింట్లతో 8వ స్థానంలో... పాకిస్తాన్ జట్టు పాయింట్ల ఖాతా తెరవకుండానే చివరిదైన 9వ స్థానంలో ఉన్నాయి. ప్రొ లీగ్‌లో మొత్తం తొమ్మిది జట్లు 16 మ్యాచ్‌ల చొప్పున ఆడతాయి. ఇప్పటికి అన్ని జట్లు 12 మ్యాచ్‌ల చొప్పున పూర్తి చేసుకున్నాయి. ఈనెల 28తో సీజన్ ముగియనుండగా... 34 పాయింట్లతో బెల్జియం అగ్రస్థానంలో కొనసాగుతోంది.
అనసూయ బీచ్ వెకేషన్.. ఎంజాయ్ చేస్తూ (ఫొటోలు)
మా ఇంటి బంగారంలా మెరిసిపోతున్న యాంకర్ శ్రీముఖి.. ఫోటోలు
చీరకట్టులో సరికొత్తగా గ్లామర్ చూపిస్తూ.. (ఫొటోలు)
సిల్వర్ శారీలో ధగ ధగ మెరిసిపోతున్న భూమి పెడ్నేకర్
‘హను మాన్ 3డీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
దారుణం.. మంచినీళ్లు ఇవ్వలేదని తల్లిపై కొడుకు దాడి
చిన్నారి డ్రీమ్ ను నిజం చేసిన బన్నీ.. స్వయంగా వీడియో కాల్ చేసి..!
మెట్రో రైల్ ఎక్కిన కోతి.. చుట్టాలింటికి పోతున్నదేమో
ఎంపీకి, CI నాగరాజు మధ్య భారీ డీల్? బయటకి వస్తున్న సంచలన నిజాలు