
అమెరికాలో 23 ఏళ్లుగా నివసిస్తూ, అత్యంత విజయవంతమైన జీవితాన్ని గడుపుతున్న ఓ ఎన్నారై స్వదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. సుమారు రూ.
56 కోట్లు విలువైన సంపదను కూడబెట్టినప్పటికీ, ఆ దేశంలో తాను ఇప్పటికీ ఒక 'పరాయివాడినే' అనే భావన వెంటాడుతోందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారి, ప్రవాస భారతీయుల జీవితాల్లోని మరో కోణాన్ని ఆవిష్కరించింది.ఆ ఎన్నారై తన రెడ్డిట్ పోస్ట్‌లో.. "నేను మొదట అమెరికాకు వచ్చినప్పుడు చాలా ఉత్సాహంగా ఫీలయ్యాను. ప్రపంచం నడిబొడ్డున అడుగుపెట్టినట్లు అనిపించింది. నేను భారతదేశంలో పెరిగిన ప్రదేశంతో పోలిస్తే, ఇక్కడి మౌలిక సదుపాయాలు, జీవన ప్రమాణాలు ఎంతో ఉన్నతంగా అనిపించాయి. సంపాదనలో ఎక్కువ భాగం... జీతం, ఈక్విటీ కాంపెన్సేషన్, అమెరికన్ టెక్ స్టాక్స్‌లో దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా వచ్చాయి. ఈరోజు నా ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో విలువ సుమారు 6 మిలియన్ డాలర్లు. దీనికి అదనంగా మరికొన్ని ఆస్తులు కూడా ఉన్నాయి" అని ఆయన పేర్కొన్నారు.అయితే, ఇంత సంపద ఉన్నప్పటికీ, భారత్‌కు తిరిగి వెళ్లాలనే ఆలోచన ఆర్థికపరమైనది కాదని స్పష్టం చేశారు. "ఇన్నేళ్లయినా నేను ఇక్కడ అప్పుడప్పుడు పరాయివాడిలాగే భావిస్తున్నాను. మాటల్లో చెప్పలేని ఒక అదృశ్య దూరం వెంటాడుతూనే ఉంది. నువ్వు ఎంత సాధించినా, ఈ ప్రదేశంలో పూర్తిగా భాగం కాలేకపోతున్నావనే భావన కలుగుతోంది" అని తన ఆవేదనను పంచుకున్నారు.భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ.. "వయసు పైబడ్డాక అమెరికాలో నా జీవితం ఎలా ఉంటుందోనని ఆలోచిస్తున్నాను. కుటుంబ బంధాలు, సామాజిక మద్దతు, మానసిక