
ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు భారతీయ వ్యాపారవేత్త కునాల్ షా కొత్త సీఈవోగా నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3.
3 బిలియన్లకు పైగా యూజర్లున్న వాట్సాప్ బాధ్యతలను ఆయన చేపట్టనున్నారు. అయితే కునాల్ షా విద్యార్హతలే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.చాలా మంది టెక్నాలజీ దిగ్గజాల మాదిరిగా కునాల్ షా ఇంజినీరింగ్ చదవలేదు. ముంబైలోని విల్సన్ కాలేజీలో ఫిలాసఫీలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం ఎంబీఏలో చేరినా ఏడాది తర్వాత చదువును మధ్యలోనే నిలిపివేశారు. తరగతి గదుల కంటే బయట ప్రపంచంలోనే ఎక్కువ నేర్చుకున్నానని ఆయన గతంలో పలుసార్లు చెప్పారు.కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇంజినీరింగ్ చదివే అవకాశం రాలేదని కునాల్ షా గత ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. అయితే సంప్రదాయ ఉద్యోగ మార్గాన్ని ఎంచుకోకుండా వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. 2010లో ఫ్రీచార్జ్ అనే డిజిటల్ పేమెంట్స్, మొబైల్ రీచార్జ్ ప్లాట్‌ఫామ్‌ను ఇతరులతో కలిసి స్థాపించారు. ఆన్లైన్ చెల్లింపులు ప్రారంభ దశలో ఉన్న సమయంలో క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో ఫ్రీచార్జ్కు భారీ ఆదరణ లభించింది. సంస్థ వేగంగా ఎదగడంతో 2015లో స్నాప్‌డీల్ దాన్ని 400-450 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంతో కొనుగోలు చేసింది.ఆ తర్వాత కొంతకాలం స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టిన కునాల్ షా 2018లో ‘క్రెడ్’ను ప్రారంభించారు. క్రెడిట్ కార్డు బిల్లులు సకాలంలో చెల్లించే వినియోగదారులకు రివార్డులు ఇచ్చే ఆలోచనతో ప్రారంభమైన ఈ సంస్థ తర్వాత రుణాలు, పేమెంట్లు, ఇన్సూరెన్స్, వెల్త్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లోకి విస్తరించింది. ప్రస్తుతం భారత ఫిన్‌టెక్ రంగంలోని ప్రముఖ సంస్థల్లో ఒకటిగా