
Pune trekker death case: కేతన్ విశాల్ అగర్వాల్ అనే బిజినెస్ మెన్ ఇటీవల పూణెలోని లోహగఢ్ ప్రాంతంలో కోట నుంచి లోతైన లోయలోపడ్డ కేసును హత్య కేసు గా నిర్దారించి పోలీసులు షాకింగ్ విషయాల్ని బైటపెట్టారు.
ఈ ఘటనలో యువతితో పాటు ఆమె ప్రియుడ్ని కూడా అరెస్ట్ చేశారు.ఈ ఘటన మరో సోనమ్ కేసుగా మారిందని నెటిజన్లు యువతిని ఏకీపారేస్తున్నారు.
మహరాష్ట్రలోని పూణెలో ఇటీవల కేతన్ విశాల్ అగర్వాల్ కు, సియా గోయల్ కు పెద్దలు అంతా కలిసి ఈ ఏడాది చివర్లో పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఈ క్రమంలో జూన్ 18న తనకు కాబోయే భార్యను సర్ ప్రైజ్ చేద్దామని విశాల్ అగర్వాల్ ఆమెను లోహగడ్ లోని కోటకు తీసుకెళ్లాడు. అక్కడ ఫోటోలు తీస్తుండగా 400 అడుగుల లోయలో విశాల్ కాలు జారీ పడిపోయాడని యువతి చెప్పింది. ముందుగా అందరు ఇదే నిజమని నమ్మారు.
కానీ సియా చెబుతున్న మాటలపై పోలీసులకు అనుమానంతో తనదైన శైలీలో విచారణ చేపట్టారు. ఈ ఘటనలో సియా , ఆమె ప్రియుడు చేతన్ చౌదరి పక్కా స్కెచ్ తో అక్కడకు రప్పించి మరీ లోయలో తోసేసి చంపినట్లు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన ఆమె వాట్సాప్ చాట్ లు,కాల్స్ లను కూడా పోలీసులు సేకరించారు.
అంతేకాకుండా సియా గోయల్ తన కోలిగ్ చేతన్ చౌదరీ చాలా కాలంలో ప్రేమలో ఉన్నారని విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరు కలిసి పక్కా ప్లాన్ తో విశాల్ ను లోయలోకి తోసేసి చంపేస్తే పెళ్లి ఆగిపోతుందని ఈవిధంగా చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. పోలీసులు సియా గోయల్ మూడు సార్లు తనకు కాబోయే భర్తకు హత్యకు స్కెచ్ లు వేసినట్లు పోలీసులు గుర్తించారు. మే 31న, కేతన్ అగర్వాల్ , సియా గోయల్ లోహగడ్ కోటకు యాత్రకు వెళ్లారు. ఈ పర్యటనలోనే, కేతన్‌ను చంపాలనే ప్రణాళికను సియా మొదటిసారిగా రచించిందని ఆరోపణలు ఉన్నాయి. కానీ అప్పుడు అక్కడ చాలా మంది టూరిస్టులు ఉండటంతో వీరిస్కెచ్ ను వాయిదా వేసుకున్నారు.
మరల జూన్ 14న, వారు కేతన్‌ను లోహగడ్‌కు తీసుకెళ్లి, ఒక పాముతో దాడి చేయించి లోయలోకి తోసివేయడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా వీరి ప్లాన్ విఫలమైంది. ఇక మూడో సారి ఎలాగైన చంపాలని గట్టిగా ప్లాన్ వేసి మరీ జూన్ 18న సియా లోహగడ్‌కు మరో యాత్రకు ప్రణాళిక వేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ పర్యటన నేపథ్యంలో.. ముందుగానే యువతి, చేతన్ చౌదరిని వెనుక నుండి అక్కడికి పిలిపించి, కేతన్ అగర్వాల్‌ను కోట పైనుంచి తోసేశారని, ఫలితంగా అతను మరణించాడని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరగలేదని, ఇది పథకం ప్రకారం చేసిన హత్య అని తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు చెబుతున్నారు. అయితే బాలికి కూడా వెళ్లాలని ప్లాన్ చేశారని కానీ సియా పాస్ పోర్ట్ పొగొట్టుకున్నందుకు ఆ ప్రయాణం వాయిదా వేసుకున్నట్లు విషయం సైతం బైటపడింది.
వీరి పెళ్లిని ఎంతో గ్రాండ్ గా నిర్వహించాలని.. రూ.17 కోట్లతో జైపూర్‌లో పెళ్లికి లగ్జరీ రిసార్ట్ ను కూడా కుటుంబ సభ్యులు బుక్ చేశారు. ఈ తరుణంలో ఈ ఘోరం వెలుగులోకి రావడంతో ఇరుకుటుంబాలు సైతంషాక్ కు గురౌతున్నారు. ప్రస్తుతం సియా గోయల్ ను, ఆమె ప్రియుడు కేతన్ అగర్వాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రైమ్ లో మరికొంత మంది పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని సైతం అరెస్ట్ చేస్తామని ప్రకటించారు.