
తెలంగాణలో పెరుగుతున్న క్యాన్సర్ కేసుల నియంత్రణకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, వైద్య నిపుణులు కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రజతోత్సవ వేడుకలకు ఆయన హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పర్యావరణ కాలుష్యం, జన్యుపరమైన కారణాలతో క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తోందన్నారు. రాష్ట్రంలో ఏటా 50,000 నుంచి 55,000 వరకు కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని, ఒక వ్యక్తికి వ్యాధి సోకితే ఆ కుటుంబం మొత్తం మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా తీవ్రంగా ప్రభావితమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.క్యాన్సర్‌పై పోరాటంలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక చర్యలు చేపట్టిందని మంత్రి వివరించారు. క్యాన్సర్‌ను నోటిఫైయబుల్ వ్యాధిగా ప్రకటించడంతో పాటు, ప్రతి కేసును నమోదు చేసేందుకు స్టేట్ క్యాన్సర్ రిజిస్ట్రీ, క్యాన్సర్ పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నివారణ, ముందస్తు గుర్తింపుపై ప్రజల్లో అవగాహన కల్పించడంపై దృష్టి సారించామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు బసవతారకం వంటి ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత, రాయితీ వైద్యం అందిస్తున్నామని, క్యాన్సర్ చికిత్స కారణంగా ఏ కుటుంబం పేదరికంలోకి జారకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.25 ఏళ్లుగా క్యాన్సర్ రోగులకు అద్భుతమైన సేవలందిస్తున్న బసవతారకం ఆసుపత్రి యాజమాన్యాన్ని మంత్రి అభినందించారు. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న ఛైర్మన్ నందమూరి బాలకృష్ణను ప్రత్యేకంగా ప్రశంసించారు.అమరావతిలో వెయ్యి పడకల బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి: ఏపీ మంత్రి సత్యకుమార్ప్రముఖ క్యాన్సర్ చికిత్సా కేంద్రమైన