
బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ కీలక పాత్రలో వస్తోన్న లేటేస్ట్ మూవీ ఈత. స్త్రీ-2 బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఆమె పీరియాడికల్ స్టోరీలో నటిస్తున్నారు.
Jun 23 2026 3:27 PM | Updated on Jun 23 2026 3:41 PM
బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ కీలక పాత్రలో వస్తోన్న లేటేస్ట్ మూవీ ఈత. స్త్రీ-2 బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఆమె పీరియాడికల్ స్టోరీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఛావా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రణ్‌దీప్ హుడా కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ మేకర్స్ రిలీజ్ చేశారు.
టీజర్ చూస్తుంటే విఠాబాయి భావు మాంగ్ నారాయణ్గావ్కర్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిననట్లు తెలుస్తోంది. బ్రిటీష్ కాలం నుంచే డ్యాన్సర్‌గా ఆమె ఎలాంటి పరిణామాలు ఎదుర్కొందనే కోణంలో ఈ మూవీ ఉండనుందని అర్థమవుతోంది. ఈ టీజర్లో నిండు గర్భిణిగా ఉన్న ఆమె డ్యాన్స్ చేయడం అంచనాలు పెంచుతోంది. ఈ టీజర్ చూస్తుంటే ఛావా మూవీలాగే మరో బ్లాక్‌బస్టర్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అజయ్-అతుల్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఆగష్టు 28, 2026న థియేటర్లలో విడుదల కానుంది.
లేటు వయసులోనూ మరింత అందంగా హీరోయిన్ (ఫొటోలు)
నాగదుర్గ.. యూట్యూబ్ సాంగ్స్ నుంచి హీరోయిన్ ఛాన్స్‌ల వరకు (ఫొటోలు)
హైదరాబాద్ : అర్ధనారీశ్వరం..అద్భుతం (ఫొటోలు)
వైష్ణవిని పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)
రూట్ మార్చిన పోలీసులు... ఎక్కడికి తీసుకెళ్తారు అనే దానిపై ఉత్కంఠ
మీరిద్దరూ గుండు కొట్టించుకోండి..! లేదంటే ఆవు మూత్రాన్ని నేనే మీ మొఖాన...
CI నాగరాజును ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏం ప్రశ్నలు అడగనున్నారు.?
దళిత మహిళ గంగమ్మ మృతిపై హైకోర్టులో విచారణ