టెక్ ప్రపంచంలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదరణ పొందిన మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ నూతన గ్లోబల్ హెడ్‌గా, సీఈఓగా భారతీయ ఫిన్‌టెక్ స్టార్టప్ క్రెడ్ (క్రెడ్)...
టెక్ ప్రపంచంలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదరణ పొందిన మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ నూతన గ్లోబల్ హెడ్‌గా, సీఈఓగా భారతీయ ఫిన్‌టెక్ స్టార్టప్ క్రెడ్ (క్రెడ్) వ్యవస్థాపకుడు కునాల్ షాను నియమిస్తున్నట్లు 'మెటా' ప్రకటించింది. అదే సమయంలో క్రెడ్ సంస్థలో సుమారు 900 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 8,550 కోట్లు) మేర భారీ పెట్టుబడి పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించింది.ఈ ఒప్పందంతో క్రెడ్ కంపెనీలో మెటాకు సుమారు 20 శాతం మైనారిటీ వాటా లభించనుంది. దీనితో సంస్థ విలువ 4.5 బిలియన్ డాలర్లకు (రూ. 43,239 కోట్లు) చేరినట్లు అంచనా. ఈ తాజా నియామకంతో కునాల్ షా క్రెడ్ సీఈఓ పదవి నుంచి వైదొలగి, మెటా గ్లోబల్ లీడర్షిప్ టీమ్‌లో చేరనున్నారు. గడిచిన ఏడేళ్లుగా వాట్సాప్‌కు నేతృత్వం వహిస్తున్న విల్ క్యాత్‌కార్ట్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనుండగా, క్యాత్‌కార్ట్ ఇకపై మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు.భారతీయ మార్కెట్లో అత్యంత విజయవంతమైన కన్జ్యూమర్ ఉత్పత్తులను రూపొందించడంలో కునాల్ షాకు ఉన్న అనుభవం, డిజిటల్ చెల్లింపుల రంగంలో ఆయన నైపుణ్యం తమకు ఎంతగానో దోహదపడతాయని మెటా ఒక ప్రకటనలో పేర్కొంది. క్లిష్టమైన వ్యాపార వాతావరణంలోనూ వృద్ధిని సాధించగల కునాల్ షాలోని వ్యవస్థాపక సామర్థ్యాన్ని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఈ సందర్భంగా ప్రశంసించారు.2018లో ప్రారంభమైన క్రెడ్, క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించే వినియోగదారులకు రివార్డులు అందిస్తూ స్వల్ప కాలంలోనే విశేష గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ సంస్థ చెల్లింపులు,