
ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా, తమ ఫ్లాగ్షిప్ ఎస్యూవీ లైనప్‌లో పెర్ఫార్మెన్స్ మోడల్ అయిన కొడియాక్ ఆర్ఎస్ (Kodiaq RS) కోసం బుకింగ్స్ ప్రారంభించింది.
తొలి దశలో కేవలం 50 యూనిట్లను మాత్రమే అమ్మకానికి ఉంచనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ కారును బుక్ చేసుకోవాలనుకునే వారు రూ. 3 లక్షల టోకెన్ అమౌంట్‌తో రిజర్వ్ చేసుకోవచ్చు.ఈ ఎస్‌యూవీని పూర్తిగా విదేశాల్లో తయారు చేసి (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ - CBU) భారత్‌కు దిగుమతి చేయనున్నారు. దీని ధరలను జులై 2, 2026న అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే, ఇండస్ట్రీ వర్గాల అంచనా ప్రకారం దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 55 లక్షల నుంచి రూ. 60 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది స్టాండర్డ్ కొడియాక్ వేరియంట్ల కంటే ఎక్కువ.కొడియాక్ ఆర్ఎస్ పెర్ఫార్మెన్స్కు పెద్దపీట వేస్తుంది. ఇందులో 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 265 హెచ్‌పీ పవర్, 400 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వస్తున్న ఈ కారు కేవలం 6.3 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 231 కిలోమీటర్లు. డైనమిక్ ఛాసిస్ కంట్రోల్ (DCC) ప్లస్ అడాప్టివ్ సస్పెన్షన్, స్పోర్ట్, ఆఫ్-రోడ్ వంటి డ్రైవ్ మోడ్లు దీని ప్రత్యేకత.డిజైన్ పరంగా కూడా ఇందులో చాలా మార్పులు చేశారు. స్పోర్టియర్ బంపర్లు, గ్లోస్ బ్లాక్ ట్రిమ్, ఆర్ఎస్ బ్యాడ్జింగ్,