
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా గోపీచంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK111 సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొనగా, తాజాగా హీరోయిన్ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) చేసిన కామెంట్స్ మరింత చర్చకు దారితీశాయి. ఈ సినిమాలో భాగమవడం తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమన్నారు. బాలకృష్ణ సరసన పవర్ఫుల్ పాత్రలో నటించే అవకాశం రావడం నిజంగా డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అని చెప్పింది. కథలో తన పాత్రకు ఉన్న ప్రాధాన్యత తనను వెంటనే ఆకట్టుకుందని ఆమె వెల్లడించింది.
మరోవైపు, బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబినేషన్లో గతంలో వచ్చిన వీరసింహారెడ్డి(Veerasimha redddy) బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడంతో NBK111పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి కూడా అభిమానులు ఆశించే అన్ని అంశాలతో పాటు బలమైన కథ, మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ డ్రామా ఉండేలా డైరెక్టర్ ప్లాన్స్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, యూనిట్ సినిమా క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా పనిచేస్తోందని తెలుస్తోంది.
ప్రత్యేకంగా కాజల్ అగర్వాల్‌కు ఈ సినిమా కీలకంగా మారనుంది. కొంత గ్యాప్ తర్వాత పూర్తి లెంగ్త హీరోయిన్ గా ఆమె చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో కూడా మంచి ఆసక్తి కనిపిస్తోంది. సాధారణ కమర్షియల్ హీరోయిన్ పాత్రకు భిన్నంగా, కథను ప్రభావితం చేసే కీలక పాత్రను కాజల్ పోషిస్తున్నట్లు సమాచారం. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, కాజల్ అగర్వాల్ కలయికతో NBK111 ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అత్యంత ఆసక్తికరమైన తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలుస్తోంది.