
టాలీవుడ్లో ఎంతో ప్రొఫెషనల్, కూల్ స్టార్‌గా పేరున్న విక్టరీ వెంకటేష్(Venkatesh) కెరీర్ మొత్తాన్ని పరిశీలిస్తే డైరెక్టర్లు లేదా సహనటులతో విభేదాల వార్తలు చాలా అరుదుగానే వినిపించాయి.
అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం AK47(Aadarsha kutumbam AK47) సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. త్రివిక్రమ్ పని తీరు, ముఖ్యంగా సెట్స్‌పైనే సన్నివేశాలు, డైలాగ్‌లు తిరిగి రాసే అలవాటు వెంకటేష్ కు కొంత ఇబ్బందిగా మారిందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు త్రివిక్రమ్ కు సక్సెస్‌లను అందించిన ఇదే విధానం ఇప్పుడు షూటింగ్‌పై ఒత్తిడి పెంచుతోందని టాక్ వినిపిస్తోంది.
ఈ డిస్కషన్స్ కు మరో కారణం కూడా ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అర్జున్ సర్జా(Arjun sarja) నటించిన బ్లాస్ట్(Blast) సినిమా కథతో ఆదర్శ కుటుంబం మెయిన్ లైన్‌కు కొన్ని పోలికలున్నాయనే వార్తలు బయటకు రావడంతో, రెండు సినిమాలు ఒకేలా అనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అందులో భాగంగా షూటింగ్ జరుగుతుండగానే కొన్ని సీన్స్ ను మార్చడం, కొత్తగా రాయడం జరుగుతోందని సమాచారం. ఇదే అంశం వెంకటేష్‌కు అంతగా నచ్చడం లేదనే ప్రచారం సాగుతోంది. అయితే త్రివిక్రమ్ మాత్రం తన ఎక్స్‌పీరియెన్స్, ఇన్‌స్టింక్ట్‌పై పూర్తి నమ్మకంతో ముందుకు వెళ్తున్నారని అంటున్నారు.
మరోవైపు గుంటూరు కారం(Guntur Karam) విషయంలో కథనం అసంతృప్తిని కలిగించిందనే విమర్శలు రావడంతో, త్రివిక్రమ్ రీరైటింగ్ విధానంపై మళ్లీ చర్చ మొదలైంది. ప్రస్తుతం వెంకటేష్- త్రివిక్రమ్ మధ్య ఎలాంటి బహిరంగ విభేదాలు ఉన్నాయనే ఆధారాలు లేవు. అయినప్పటికీ వర్కింగ్ స్టైల్లోని తేడాల వల్ల కొంత టెన్షన్ ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే చివరికి సినిమా ఫలితమే ఈ డిస్కషన్స్ కు సమాధానం చెప్పనుంది. ఆదర్శ కుటుంబం ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంటే ఈ రూమర్స్ అన్నీ మాయమవుతాయి. అదే ఆశించిన స్థాయిలో ఫలితం రాకపోతే సెట్స్‌పై స్క్రిప్ట్ మార్పులు, రీరైట్స్ అంశాలు మళ్లీ హాట్ టాపిక్‌గా మారే అవకాశం ఉంది.