
Phones under 15K | ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది స్మార్ట్ఫోన్ల ధరలకు రెక్కలొచ్చాయి. ఏఐ కంపెనీల నుంచి డిమాండ్ కారణంగా మెమొరీ చిప్‌ల వ్యయం పెరగడంతో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలన్నీ తమ ఉత్పత్తుల ధరలను...
Phones under 15K | ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది స్మార్ట్ఫోన్ల ధరలకు రెక్కలొచ్చాయి. ఏఐ కంపెనీల నుంచి డిమాండ్ కారణంగా మెమొరీ చిప్‌ల వ్యయం పెరగడంతో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలన్నీ తమ ఉత్పత్తుల ధరలను పెంచేశాయి. దీంతో బడ్జెట్లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి ఆప్షన్లు తగ్గిపోయాయి. అయితే, ఇప్పటికీ మార్కెట్లో రూ.15 వేల బడ్జెట్లో కొన్ని వాల్యూ ఫర్ మనీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మోటొరోలా, ఒప్పో, రియల్మీ, శాంసంగ్ వంటి ప్రముఖ బ్రాండ్ల నుంచి ఈ ఆప్షన్లు ఉన్నాయి. అవేంటో చూసేయండి..
1. రూ.15 వేల దిగువ బడ్జెట్లో మోటొరోలా నుంచి Moto G37 Power ఉంది. 6.67 అంగుళాల డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు ఉంది. 50 ఎంపీ ప్రధాన కెమెరా+ 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7,000mAh బ్యాటరీ ఉంది. 4+128జీబీ వేరియంట్ ధర రూ.15,999 ఉంది. కార్డు ఆఫర్లతో ఈ ఫోన్ కొనుగోలు చేయొచ్చు. మరో ఆప్షన్‌గా Moto G37 5G ఉంది. 4+64జీబీ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది.
2. ఒప్పో నుంచి Oppo K14x ఉంది. ఇందులో 6.75 అంగుళాల డిస్ప్లే, ఫోన్ వెనుకవైపు 50 ఎంపీ+ 2 ఎంపీ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 6,500 ఎంఏహెచ్ బ్యాటరీతో లభ్యమవుతున్న ఈ ఫోన్ 4+64జీబీ వేరియంట్ ధర రూ.15,745గా ఉంది. కార్డు ఆఫర్లతో రూ.15 వేల కన్నా తక్కువగానే ఈ ఫోన్ కొనుగోలు చేయొచ్చు.
3. పోకో నుంచి ఉన్న ఆప్షన్ Poco C85. ఇందులో 6.9 అంగుళాల డిస్ప్లే, ఐపీ64 రేటింగ్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 4+128 జీబీ వేరియంట్ ధర రూ.14,499గా ఉంది.
4. శాంసంగ్ నుంచి గెలాక్సీ M17.. ఎంట్రీ లెవల్ యూజర్లకు ఇదో బెస్ట్ ఆప్షన్. 6 ప్రధాన ఓఎస్ అప్డేట్స్తో వస్తోంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐపీ 54 రేటింగ్ ఉంది. 4+128 జీబీ వేరియంట్ ధర రూ.14,499గా ఉంది. ఇదే శాంసంగ్ నుంచి ఉన్న మరో ఆప్షన్ గెలాక్సీ M17e 5G. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000 mAh బ్యాటరీ కలిగి ఉంది. 4+128 జీబీ వేరియంట్ ధర రూ.13,499గా ఉంది.
5. వివో సబ్‌బ్రాండ్ ఐకూ నుంచి రూ.15 వేలలోపు బడ్జెట్లో iQOO Z10 Lite ఉంది. ఫోన్ వెనుక 50 ఎంపీ+ 2 ఎంపీ కెమెరా, ముందు వైపు 8 ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. 15W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. 4+ 64 జీబీ వేరియంట్ ధర రూ.14,999కు లభిస్తుంది.
6. రియల్మీ నుంచి realme P3x అందుబాటులో ఉంది. ఇందులో 6.72 అంగుళాల డిస్ప్లే, ఫోన్ వెనుకవైపు 50 ఎంపీ+ 2 ఎంపీ కెమెరా; సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా ఇచ్చారు. 45W ఛార్జింగ్ సదుపాయంతో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 6+ 128 జీబీ వేరియంట్ ధర రూ.12,999, 8+128 GB వేరియంట్ ధర రూ.13,999గా ఉంది.
7. పోకో నుంచి Poco m7 pro ఉంది. 6.67 అంగుళాల డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేటు ఉంది. ఫోన్ వెనుకవైపు 50 ఎంపీ+ 2 ఎంపీ కెమెరా ఉన్నాయి. 20 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5,110 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 6+ 128 జీబీ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది.
8. రియల్మీ నుంచి Realme p4 lite మరో ఆప్షన్. ఇందులో 6.8 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే, 13 ఎంపీ ప్రధాన కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 144 Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. 15W సూపర్ ఛార్జింగ్ సపోర్టుతో 7000 mAh బ్యాటరీ ఇచ్చారు. 4+64 జీబీ వేరియంట్ ధర రూ.14,385గా ఉంది.
9. షావోమికి చెందిన రెడ్మీ నుంచి Redmi A7 Proలో 6.9 అంగుళాల డిస్ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 32 ఎంపీ ప్రధాన కెమెరా+ 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6,300 mAh బ్యాటరీ ఇచ్చారు. 4+64 జీబీ వేరియంట్ ధర రూ.12,999, 4+128 GB వేరియంట్ ధర రూ.13,999గా కంపెనీ నిర్ణయించింది.
10. రియల్మీ నుంచి realme Narzo 100 Lite 5G మరో ఆప్షన్. 6.81 అంగుళాల డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్, 13 ఎంపీ ప్రధాన కెమెరా+ 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 15 W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో 7000 mAh బ్యాటరీ ఉంది. 4+64 జీబీ వేరియంట్ ధర రూ.14,249గా ఉంది.
గమనిక: కథనం రాసే సమయానికి అందుబాటులో ఉన్న ధరలు వివరాలు పొందుపరిచాం. ధరల్లో హెచ్చుతగ్గులు ఉండొచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.