
తిరుపతి జిల్లాలో సోమవారం (జూన్ 22) ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పుల్లంపేట వద్ద కడప డిపోకు చెంది
న ఆర్టీసీ బస్సు, ఒక భారీ లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
తిరుపతి నుంచి కడప వైపు వెళ్తున్న నాన్‌స్టాప్ ఆర్టీసీ సర్వీసు బస్సు పుల్లంపేట సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ప్రమాదం జరిగిన సమయంలో రెండు వాహనాలూ కూడా అతి వేగంతో ఉన్నాయని అంటున్నారు. ఈ ప్రమాదంలో మృతులను ఏడాది వయస్సున్న పునీత్ సాయి, శ్రీకాళహస్తికి చెందిన 16 ఏళ్ల యశ్వితగా గుర్తించారు.
ఏఐ టెక్నాలజీని ఉపయోగించి బాలికను వేధించిన కీచక ఉపాధ్యాయుడు!
.