
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
తెలంగాణ విద్యా వ్యవస్థలో సంస్కరణలు: విద్యాసంవత్సర ఆరంభంలో తెలంగాణ ప్రభుత్వం విద్యావ్యస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. సర్కారు స్కూళ్లపై వ్యతిరేక భావనను దూరంచేసి…..సర్కారు స్కూళ్లపై ప్రత్యేక గౌరవం పెంపొందించేవిధంగా స్కూళ్లను సరికొత్తగా అందుబాటులోకి తెచ్చారు. స్కూలు ఆవరణలో క్రీడామైదానం, లైబ్రరీ, కిచెన్, డైనింగ్ హాల్ పరిసరాలను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తిరిగి పరిశీలించారు. ఇపుడీ స్కూళ్లో అడ్మిషన్స్ కోసం విద్యార్ధుల తల్లిదండ్రులు ఎగబడుతున్నారు.
కార్పోరేట్ స్కూల్స్‌కు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు.. కార్పొరేట్ స్థాయికి ఏమాత్రం తీసిపోని రీతిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, అత్యాధునిక వసతులతో రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తీర్చిదిద్దిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ముఖ్యమంత్రి గతవారం ప్రారంభించారు. ఇదే సందర్భంగా విద్యార్థులకు ఉదయం అందించే బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించి, విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకోవడం విశేషం.
సర్వహంగులతో రూపుదిద్దుకున్న ఆరుట్ల స్కూల్.. సర్కారు స్కూళ్లల్లో మాణిక్యాలను వెలికి తీయాలన్న సంకల్పంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆరుట్ల గ్రామంలో ప్రారంభించిన తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థి లోకానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అభిప్రాయం వ్యక్తంచేశారు. సర్కారు స్కూళ్లపై ఉన్న హేళన భావనను ఆరుట్ల స్కూల్ రూపుమాపుతుందన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ లుగా రాణించగలరన్న ఒక బృహత్తర సంకల్పంతో మోడల్ స్కూల్ ను తీర్చిదిద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు పాఠశాలలో 1814 మంది పిల్లలు పాఠశాలలో చేరగా, సీట్లు ఖాళీ లేవని, అడ్మిషన్లు పూర్తయ్యాయని ప్రభుత్వ పాఠశాల బయట బోర్డు పెట్టే పరిస్థితికి రావడం పట్ల కమిటీని సీఎం అభినందించారు. విధ్వంసమైన తెలంగాణ విద్యా విధానాన్ని వికాసం వైపు నడిపించే విధంగా ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆదర్శంగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తంచేశారు.
కేవలం సంక్షేమ పథకాలు భవిష్యత్తును మార్చలేవు. మన భవిష్యత్తు మారాలన్నా, తల్లిదండ్రులు ఆత్మగౌరవంతో బతకాలంటే చదువుకోవాలి. చదువుకున్నప్పుడే మన ఊరికి, మన రాష్ట్రానికి, దేశానికి పేరొస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 27 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అని తెలిపారు. అంతేకాదు తెలంగాణ వ్యాప్తంగా 100 స్కూళ్లను ఇదే తరహాలో అభివృద్ది చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.