
సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకువెళ్లడమే కూటమి ప్రభుత్వ గొప్పతనమని కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఐదేళ్ల గొడ్డలి పార్టీ పాలనలో ఏపీని దారు
ణంగా దెబ్బతీస్తే.. రెండేళ్లలో ప్రగతిమార్గం పట్టించామని పేర్కొన్నారు. పెదకూరపాడు ఎమ్మెల్యే చేపట్టిన ‘ప్రజల వద్దకు ప్రవీణ్ 100 రోజులు 100 గ్రామాలు 100వ రోజు’ కార్యక్రమం పల్నాడు జిల్లా అమరావతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీతో అమరావతి వీధులు హోరెత్తాయి. ఈ వార్త చదివారా: బోయపాడు తీరంలో కాలుష్యంపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా