
ఇంటర్నెట్‌డెస్క్: వెంకటేశ్ (Venkatesh), కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) కీలక పాత్రల్లో దర్శకుడు అనిల్ రావిపూడి ఓ మూవీని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవల ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇక మూవీ ప్రమోషన్స్ చేయడంలో దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) స్టైలే వేరు. తాజాగా సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్, (anil ravipudi new movie music director) గేయ రచయిత అనంత్ శ్రీరామ్‌లను ఇసుకలో పాతిపెట్టి మరీ మూవీ ట్యూన్స్ సిద్ధం చేయించిన ఆయన ఇప్పుడు కత్తితో హంగామా చేస్తూ తనదైన శైలిలో కొత్త మూవీకి ప్రచారం కల్పించే ప్రయత్నం చేశారు.
‘ఎప్పుడూ నేనే ఐడియాలు ఇవ్వాలా’ అంటూ కత్తితో అనిల్ రావిపూడి రాగా, (Anil Ravipudi New Movie) కథానాయకుడు వెంకటేశ్ ఆ కత్తి తీసుకుని అనిల్ చేయి కోసి మరీ ఆయనకే వీర తిలకం దిద్దడంతో ఒక్కసారిగా షాకయ్యారు. ఆ తర్వాత వరుసగా కల్యాణ్‌రామ్, కీర్తి సురేశ్ (Keerthy Suresh), కృతిశెట్టిలు (Krithi Shetty) కూడా ఇదే పని చేయడంతో అనిల్ హడలెత్తిపోయారు ‘ఎంత రాయలసీమ బ్యాక్‌డ్రాప్ అయితే మాత్రం మరీ అంత రక్తపాతం అవసరమా.. మనది ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్’ అంటూ అనిల్ పలికిన సంభాషణలు నవ్వులు పూయిస్తున్నాయి. ‘సీన్ ఓపెన్ చేస్తే రాయలసీమ’ అంటూ ప్రచార వీడియోలో కనిపించడం, అనిల్ కూడా రాయలసీమ నేపథ్యంగా అని చెప్పడంతో ఈ మూవీ బ్యాక్‌డ్రాప్‌పై క్లారిటీ వచ్చింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా అనిల్ అండ్ టీమ్ పనిచేస్తోంది. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.