
క్యాన్సర్ బాధితులకు తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి వైద్యం అందించాలన్న మహోన్నత లక్ష్యంతో ఏర్పాటైన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి...
క్యాన్సర్ బాధితులకు తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి వైద్యం అందించాలన్న మహోన్నత లక్ష్యంతో ఏర్పాటైన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ చారిత్రక మైలురాయిని పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీ నోవోటెల్లో రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఆసుపత్రి ఛైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తన అర్ధాంగి బసవతారకం జ్ఞాపకార్థం, ఆమె చివరి కోరిక మేరకు ఈ ఆసుపత్రి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. క్యాన్సర్ చికిత్స సామాన్యులకు అందుబాటులో ఉండాలనే సంకల్పంతో 1988లో ఈ బృహత్కార్యానికి అంకురార్పణ చేశారు. ప్రవాస భారతీయులు, వైద్య నిపుణులు, దాతల సహకారంతో ఏర్పాటైన ఈ ఆస్పత్రిని 2000 సంవత్సరంలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 100 పడకలతో ప్రారంభించారు. అప్పటి నుంచి నిరంతరాయంగా సేవలు విస్తరిస్తూ నేడు 650 పడకల సామర్థ్యంతో దేశంలోనే సమగ్ర క్యాన్సర్ చికిత్సాలయంగా పేరు పొందింది.ప్రస్తుతం ఈ ఆసుపత్రి బాలకృష్ణ ఛైర్మన్గా, మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తూ తండ్రి ఆశయాన్ని పవిత్ర యజ్ఞంగా కొనసాగిస్తున్నారు. ఆయన నాయకత్వంలో ఆసుపత్రి ఏటా 3 లక్షల మందికి పైగా అవుట్పేషెంట్లకు, 90 వేల మంది ఇన్పేషెంట్లకు సేవలందిస్తోంది. ఇక్కడ చికిత్స పొందుతున్న వారిలో 65 శాతానికి పైగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారే ఉండటం విశేషం. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రభుత్వ పథకాల ద్వారా