కుకు విత్ జాతిరత్నాలు 2.ఓ స్టార్ట్ అయింది. నలుగురు కుక్స్ ఎలిమినేట్ కాగా.. వారి స్థానంలో కొత్త కుక్స్‌ని తీసుకు వచ్చారు.
శనివారం నాడు జరిగిన ఎపిసోడ్లో పునర్నవి, కృతిక , శ్రవణ్, సుమిత్ అంటూ నలుగురు కొత్త కుక్స్‌ను తీసుకు వచ్చారు. ఈ వీకెండ్ ఎపిసోడ్స్‌ని కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. ఈ వారం కుక్స్ వండిన వంటలకు జడ్జ్‌లు మార్కులు ఇవ్వలేదు. ఇదొక రీ లాంచ్ ఎపిసోడ్‌లా ప్లాన్ చేశారు. ఇక ఇందులో శనివారం నాడు సాటర్ డే సింగమ్స్, సండే సిజ్లర్స్ అందరూ వచ్చారు. జాతి రత్నాలు, కుక్స్ అందరూ ఒకేచోటకు వచ్చారు.కొత్త కుక్స్‌ని ప్రవేశ పెడుతూ మధ్య మధ్యలో జాతిరత్నాలకు పోటీలు నిర్వహించారు. ఇక ఆదివారం నాడు ఇలాంటి కొన్ని పోటీలను నిర్వహించారు. వచ్చిన నలుగురు కుక్స్‌ని ఎవరిని సాటర్ డే సింగమ్స్లోకి పంపించాలి.. ఎవరిని సండే సిజ్లర్స్కి పంపించాలని డిసైడ్ చేశారు. అయితే కుక్స్ సంఖ్య మొత్తంగా ఇప్పుడు 9కి చేరుకుంది. అయితే తనూజ మాత్రం ఈ ఎపిసోడ్స్‌లో ఎందుకు కనిపించలేదో అర్థం కాలేదు. తనూజ ఏమీ ఎలిమినేట్ కాలేదు. ఆమె షో నుంచి వెళ్లినట్టుగా కూడా ఎవ్వరూ చెప్పడం లేదు.కానీ శనివారం, ఆదివారం నాటి ఎపిసోడ్లో మాత్రం తనూజ కనిపించలేదు. చూస్తుంటే ఇక తనూజ మున్ముందు ఈ షోలో కనిపించదని అర్థం అవుతోంది. కొత్తగా వచ్చిన కుక్స్, ఓల్డ్ కుక్స్ అందరూ కలిసి ఓ స్పెషల్ రెసీపిని చేశారు. కొత్త కుక్స్ వండుతూ ఉంటే.. పాత కుక్స్, జాతిరత్నాలు అసిస్ట్ చేశారు. ఇక కొత్త కుక్స్, పాత కుక్స్, జాతిరత్నాలు కలిసి చేసిన రెసిపీలను జడ్జ్‌లు టేస్ట్ బాగానే ఉన్నాయని చెప్పారు. కొత్తగా వచ్చిన కుక్స్ వండటంతో.. మొదటి రోజే జడ్జ్ మెంట్, మార్కులు ఎందుకు అని అనుకున్నారో ఏమో గానీ.. స్కోర్‌ని మాత్రం ప్రకటించలేదు.ఇక సుమిత్, కృతిక సండే సిజ్లర్స్ టీంలోకి వెళ్లారు. పునర్నవి, శ్రవణ్ ఏమో శాటర్ డే సింగమ్స్ టీంలోకి వెళ్లారు. నెక్ట్స్ వీక్ నుంచి అసలు సిసలు పోటీ ఉండబోతోందన్న మాట. నెక్ట్స్ వీక్ తనూజ వస్తుందా? లేదా? ఆమె పూర్తిగా షో నుంచి క్విట్ అయిందా? అన్నది తెలియాల్సి ఉంది. పల్లవి రామిశెట్టి ఎలిమినేషన్‌ను కూడా సింపుల్‌గా చేతులు దులుపుకున్నట్టుగా చేసేసిన సంగతి తెలిసిందే. ఆమె బైట్ కూడా ప్లే చేయలేదు. షో నుంచి క్విట్ అవుతున్నా అని కళ్యాణ్ పడాల బైట్‌ను మాత్రం ప్లే చేసిన సంగతి తెలిసిందే.