
ఆ నైట్‌సూట్‌పై "నేను తప్పిపోతే, దయచేసి శిఖర్ పహారియాకు తిరిగి అప్పగించండి" అని రాసి ఉంది. ఈ మెసేజ్‌ను చూసి అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు.
కొందరు దీన్ని చాలా క్యూట్‌గా ఉందంటే, మరికొందరు మాత్రం మరీ ఓవర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది.
శిఖర్ పహారియా, జాన్వీ కపూర్ చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఆమె 2018లో బాలీవుడ్‌లోకి రాకముందు నుంచే వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని వార్తలు వచ్చాయి. వీరు తరచుగా కలిసి కనిపించడం, వీరి ఫోటోలు వైరల్ అవ్వడంతో.. వీరి రిలేషన్షిప్ స్టేటస్ గురించి అభిమానులు ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.