
దంబుల్లా: ఇండియా ఎ తో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ ఫైనల్లో శ్రీలంక ఎ ఆరు వికెట్లు కోల్పోయింది. తొలి ముగ్గురు బ్యాటర్లు అవిష్క ఫెర్నాండో (3), నిరోషన్ డిక్వెల్లా (25), నువనిదు ఫెర్నాండో (21)ని యశ్...
దంబుల్లా: ఇండియా ఎ తో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ ఫైనల్లో శ్రీలంక ఎ ఆరు వికెట్లు కోల్పోయింది. తొలి ముగ్గురు బ్యాటర్లు అవిష్క ఫెర్నాండో (3), నిరోషన్ డిక్వెల్లా (25), నువనిదు ఫెర్నాండో (21)ని యశ్ ఠాకూర్ ఔట్ చేశాడు. నాలుగో స్థానంలో వచ్చిన సదీర సమరవిక్రమ (52; 44 బంతుల్లో) అర్ధ శతకం చేసి వెనుదిరిగాడు. ఇతడిని అశోక్ శర్మ వెనక్కి పంపాడు. విప్రాజ్ నిగమ్ బౌలింగ్‌లో రవిందు ఫెర్నాండో (19).. తిలక్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సహన్ అరచ్చిగే (34)ని తిలక్ వర్మ వెనక్కి పంపాడు. 26 ఓవర్లకు శ్రీలంక స్కోరు 184/6. వనుజ సహన్ (16), విజయకాంత్ వియాస్కాంత్ (2) క్రీజులో ఉన్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఎ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తెలంగాణలో యువ క్రికెటర్ల ప్రతిభకు వెలుగులోకి తీసుకురావడం.. వారిని ఐపీఎల్, టీమ్ఇండియా వైపు నడిపించడమే లక్ష్యంగా హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఆరంభించిన టీజీ20 లీగ్ తొలికు సర్వం సిద్ధమైంది.