
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారిపోయింది. ఎండలతోపాటు.. వర్షాలు కురుస్తున్నాయి.. రుతుపవనాలు విస్తరించినప్పటికీ పెద్దగా వర్షాలు మాత్రం కురవడం లేదు.
ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కాగా, తెలంగాణలో సోమవారం నుంచి బుధవారం వరకు పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే.. ఉత్తర, తూర్పు తెలంగాణాలోని కొన్ని జిల్లాలలో ఈరోజు రేపు వడగాల్పుల కొనసాగే అవకాశం ఉంది.తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, భూపాలపల్లి, ములుగు, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. కాగా ఉత్తర, తూర్పు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఆదివారం వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే రాష్ట్రంలోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని పేర్కొంది. మరోవైపు 28 జిల్లాల్లో శనివారం 40-43 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సాయికృష్ణ వ్యవహారంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం..!!మూడు రోజులు భారీ వర్షాలుమహబూబాబాద్‌ జిల్లా బయ్యారంలో అత్యధికంగా 43.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో 7.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా, హైదరాబాద్ సిటీలో వర్షం దంచికొట్టింది. శనివారం సాయంత్రం వరకూ కూడా మాములుగానే ఉన్న వాతావరణం రాత్రి 8 గంటల తర్వాత పూర్తిగా మారిపోయింది. ఉన్నట్టుండి ఉరుములు, మెరుపులతో వర్షం మొదలైంది. చిరు జల్లులు కాస్తా భారీ వర్షంగా మారింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో భారీ వర్షం కురిసింది. హిమాయత్ నగర్, నారాయణగూడ, బషీర్ బాగ్, అబిడ్స్, కోఠి, SR నగర్, అమీర్ పేట్ పరిసరాల్లో వర్షం కుండపోతగా కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షం కురుస్తుండటంతో ఫుల్ ట్రాఫిక్ జాం అయింది.