
కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ మరోమారు తన సొంత పార్టీలోనే తీవ్ర వివాదానికి కేంద్రబిందువుగా మారారు. జీ-7 సదస్సు వేదికగా పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ భారతీయ వాణిజ్య నౌకల నావికుల భద్రత గురించి...
కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ మరోమారు తన సొంత పార్టీలోనే తీవ్ర వివాదానికి కేంద్రబిందువుగా మారారు. జీ-7 సదస్సు వేదికగా పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ భారతీయ వాణిజ్య నౌకల నావికుల భద్రత గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను శశి థరూర్ ప్రశంసించడం ఇందుకు కారణమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన బహిరంగ, వ్యక్తిగత సమావేశాల్లో పౌర నావికులను సైనిక దాడుల లక్ష్యాలుగా చేసుకోకూడదనే స్పష్టమైన సందేశాన్ని మోదీ బలంగా వినిపించారని థరూర్ కొనియాడారు. అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రచార విభాగం అధినేత పవన్ ఖేరా స్పందిస్తూ.. శశి థరూర్‌పై సోషల్ మీడియాలో సటైర్లు వేశారు.పవన్ ఖేరా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, విదేశాంగ శాఖ విడుదల చేసిన భారత్-అమెరికా అధికారిక ఉమ్మడి ప్రకటనలో ఒమన్ గల్ఫ్‌లో అమెరికా దళాల దాడి వల్ల ముగ్గురు భారతీయ నావికులు మరణించిన ఉదంతం గురించి ఎక్కడా ప్రస్తావన లేదని స్పష్టం చేశారు. "ప్రధాని మోదీపై శశి థరూర్‌కున్న ఆరాధన భౌతిక ప్రపంచ సరిహద్దులను దాటిపోయింది. అందుకే మోదీ అనని మాటలను కూడా ఆయన వినగలుగుతున్నారు" అంటూ పవన్ ఖేరా ఎద్దేవా చేశారు. దీనికి తోడుగా, విపక్ష నేత రాహుల్ గాంధీ అభిప్రాయాలకు భిన్నంగా థరూర్ ప్రభుత్వం వైపు మాట్లాడటంపై కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ పరిణామాన్ని సొమ్ము చేసుకునేందుకు రంగంలోకి దిగిన బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా.. కాంగ్రెస్ అంతర్గత విభేదాలను ఎండగడుతూ రాహుల్ గాంధీ పుట్టినరోజు నాడే శశి థరూర్ ఆయనకు