
ప్రియదర్శి (Priyadarshi) హీరోగా కొత్త సినిమాలు ఒప్పుకుంటేనే ఉన్నాడు. ఇప్పటికే లీడ్ పాత్రలో కోర్టు, మల్లేశం, బలగం వంటి సినిమాలతో మంచి పేరు, సక్సెస్ పొందాడు ప్రియదర్శి.
ఇప్పుడు బన్నీ వాస్, సుకుమార్ కలిసి ప్రియదర్శి హీరోగా ఓ సినిమాను నిర్మించబోతున్నారు. బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటించనుంది.
దాంతో టీం మొత్తం సుకుమార్ ను కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఈ మూవీ టీమ్ కు బెస్ట్ విషెస్ తెలిపారు సుకుమార్.
తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్ టైనింగ్ డ్రామాగా ఈ సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందించనున్నారు. ఈ నెల 25న ప్రారంభం కానున్న ఈ మూవీ వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.