
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన యోగా వేడుకలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌తో కలిసి సామూహిక యోగాభ్యాసంలో పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణంలో బాబా రామ్‌దేవ్‌తో కలిసి యోగా చేయడం ఎన్నటికీ మరువలేని అనుభూతిని ఇచ్చిందని ఈ సందర్భంగా సీఎం హర్షం వ్యక్తం చేశారు. యోగాకు అంతర్జాతీయ స్థాయిలో అపారమైన గుర్తింపు తెచ్చి, నేడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 190 దేశాల్లో ఈ ఉత్సవాలు నిర్వహించేలా చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మోదీ తన చొరవతో ప్రపంచానికి భారతదేశ శక్తులను చాటుతూ, దేశాన్ని అగ్రభాగాన నిలబెడుతున్నారని కొనియాడారు. సాంకేతికత, ఆధ్యాత్మికతల కలయికతోనే సమాజ భవిష్యత్తు ముడిపడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆధ్యాత్మికత, యోగా సాధన ద్వారానే హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ (సుఖీభవ ఏపీ) సాధ్యమవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో విశాఖపట్నంలో 'యోగాంధ్ర-2025' పేరిట భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రధాని మోదీ సమక్షంలో గిన్నిస్ బుక్, ప్రపంచ రికార్డులను సృష్టించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వచ్చే ఏడాది అంతర్జాతీయ యోగా వేడుకలను పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో అత్యంత ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1.33 లక్షల కేంద్రాలలో కోటి మందికి పైగా ప్రజలు యోగా సాధన చేస్తున్నారని, ఈ సంస్కృతిని ఇంటింటికీ చేర్చి ప్రజారోగ్యాన్ని కాపాడటమే తమ కూటమి ప్రభుత్వ