
నీట్ (NEET- UG 2026) పరీక్ష ఆదివారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అందరికీ ఈ పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆల్ ది బెస్ట్ చెప్పింది.
న్యూఢిల్లీ, జూన్ 21: నీట్ (NEET- UG 2026) పరీక్ష ఆదివారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అందరికీ ఈ పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఈ సందర్భంగా అభ్యర్థులకు పలు కీలక సూచనలు చేసింది.
పరీక్ష కేంద్రంలోకి ప్రవేశం ఉదయం 11:00 గంటలకు ప్రారంభం.
మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించరు.
అడ్మిట్ కార్డ్, చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీ కార్డు, 2 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు వెంట ఉండాలి.
నిషేధిత వస్తువులకు అనుమతి లేదు. ట్రాఫిక్ దృష్ట్యా ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి.
పరీక్ష కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలతోపాటు నోట్స్‌కు అనుమతి లేదు.
డ్రెస్ కోడ్ హాఫ్ స్లీవ్స్, చెప్పులు మాత్రమే వేసుకోవాలి. జీన్స్, షూస్‌తోపాటు ఆభరణాలు నిషిద్ధం.
NEET-UG పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే నిర్వహించింది. అయితే ఈ పరీక్షకు ముందే ప్రశ్న పత్రం లీక్ అయినట్లు గుర్తించింది. దాంతో ఈ పరీక్షను రద్దు చేసింది. మళ్లీ ఈ పరీక్షను ఈ రోజు (జూన్ 21వ తేదీ) నిర్వహిస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయూష్ కోర్సులకు ఎంట్రన్స్ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు ఈ పరీక్షను చేపట్టనున్నారు. పెన్ అండ్ పేపర్ మోడ్, ఆఫ్ లైన్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో ఈ పరీక్షను 72,956 మంది విద్యార్థులు రాయనున్నారు. అందుకోసం 208 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రశ్నాపత్రాల రవాణాకు తొలిసారిగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సహాయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. అందుకోసం దేశవ్యాప్తంగా 5,432 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఈ పరీక్షకు మధ్యాహ్నం 1.30 గంటల ముందే విద్యార్థులు.. ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాల్సి ఉంది. ఈ పరీక్ష నిర్వహణ కోసం 2 లక్షల మందికిపైగా సిబ్బంది పని చేస్తున్నారు. ఈ పరీక్ష కేంద్రాల వద్ద సీసీ టీవీ1.38 లక్షల కెమెరాలతోపాటు 51,311 జామర్లు ఏర్పాటు చేశారు.
RRB ఏఎల్పీ ఉద్యోగాల కోసం అప్లై చేశారా? ఈ అప్డేట్ మీ కోసమే