
శ్రీలంక-ఎతో భారత్-ఎ ఫైనల్ నేడే ఉదయం 10 నుంచి దంబుల్లా: ముక్కోణపు సిరీస్ ఫైనల్‌కు వేళైంది. ఆదివారం శ్రీలంక-ఎను భారత్-ఎ ఢీకొనబోతోంది. మ్యాచ్‌లో యువ కెరటం వైభవ్ సూర్యవంశీపైనే అందరి దృష్టీ నిలవనుంది.
ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో లంక సూపర్ ఓవర్లో భారత్‌పై గెలిచింది. అయితే ఈ మ్యాచ్ ఆఖర్లో లంక ఆటగాడు విషెన్ హలమ్బాగె పెవిలియన్‌కు వెళ్తున్న వైభవ్‌ను రెచ్చగొట్టడంతో.. భారత ఆటగాడు అతడిపైకి దూసుకెళ్లడంతో వాతావరణం వేడెక్కిన సంగతి తెలిసిందే. వైభవ్, విషెన్లకు మ్యాచ్ ఫీజులో చెరో 50 శాతం కోత పడింది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ జరగబోతుండడం ఆసక్తిని రేపుతోంది. భారత జట్టు టైటిల్ గెలవాలంటే వైభవ్‌తో పాటు కెప్టెన్ తిలక్ వర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్, బౌలర్లు యశ్ ఠాకూర్, అర్షద్ ఖాన్ రాణించడం కీలకం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.