
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Gold Rate Today: బంగారం కొనాలనుకునేవారికి ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే బంగారం ధరలు ఆల్ టైం గరిష్టస్థాయి నుంచి దాదాపు 40వేల వరకు పడిపోయాయి. ఈ ఏడాది జనవరిలో 1.90లక్షలకు చేరుకున్న బంగారం ధర అక్కడి నుంచి భారీగా పతనం అవుతూ వస్తోంది. వెండి ధర కూడా ఆల్ టైం గరిష్టం నుంచి దాదాపు 2లక్షల వరకు తగ్గింది. అయితే గత రెండు మూడు రోజులుగా భారీగా హెచ్చుతగ్గులకు లోనవుతుంది. అంతర్జాతీయ భౌగోళిక కారణాల వల్ల పసిడి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని చెప్పాలి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గడంతోపాటు డాలర్ బలపడటం వంటి కారణాల వల్ల బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయని చెప్పాలి.
అయితే నేడు జూన్ 21 వ తేదీ ఆదివారం బంగారం వెండి ధరలు చూసినట్లయితే హైదరాబాద్, విజయవాడలో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 46, 080గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1, 33, 900 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ 1,46,230 ఉండగా.. 22 క్యారెట్లు 1,34,050గా ఉంది. వెండి ధరలు కూడా స్థిరంగానే కొనసాగుతున్నాయని గమనించవచ్చు. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ. 2,55,000 ఉంది. ఢిల్లీలో 2,50,900గా ఉంది.
గత వారం శుక్రవారం ముగింపు సమయానికి ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో జూలై 3 గడువుతో ఉన్న వెండి ధర కిలోకు రూ. 2,46,186గా నమోదైంది. ప్రస్తుత ధరతో పోలిస్తే, కేవలం 5 రోజుల్లోనే కిలో వెండి ధర రూ. 13,460 మేర చౌకైంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లోనే కాకుండా.. దేశీయ మార్కెట్లో కూడా వెండి ధరలు గణనీయంగా పడిపోయాయి. ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ ధరలను పరిశీలిస్తే, జూన్ 12, శుక్రవారం సాయంత్రం 1 కిలో వెండి ధర రూ. 2,42,582 వద్ద ముగిసింది.జూన్ 19న ట్రేడింగ్ ముగిసే సమయానికి.. దీని ధర కిలోకు రూ. 2,31,973కి పడిపోయింది. అంటే కిలోకు రూ. 10,609 మేర తగ్గింది. వెండి ధర వలే బంగారం ధర కూడా గత 5 రోజుల్లో భారీగా పడిపోయింది.ఎంసీఎక్స్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,50,528 నుండి రూ. 1,47,239కి పడిపోయింది. దీంతో 10 గ్రాములకు రూ. 3,289 మేర తగ్గింది. ఒక్క గత శుక్రవారం రోజే, గోల్డ్ ఫ్యూచర్స్ రూ. 2,070 లేదా 1.39శాతం మేర పడిపోయాయి.
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.