నీరు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడతారు. ఇది శక్తి స్థాయిలు తగ్గడానికి కారణం అవుతుంది. నీరు తాగడం వల్ల ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. శక్తి పెరుగుతుంది.
10 నిమిషాల పాటు బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. నీరసం తగ్గుతుంది. వాకింగ్ చేయడంతో శక్తిని అందించే ఎండార్పిన్లు రిలీజ్ అవుతాయి.
స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయడం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. బాడీ రీచార్జ్ అవుతుంది.
డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు చేయడం వల్ల కూడా ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. దీంతో శక్తి పెరుగుతుంది.
చల్లని నీటితో స్నానం చేయడం వల్ల నాడీ వ్యవస్థ యాక్టివ్ అవుతుంది. హృదయ స్పందన రేటు బాగుంటుంది. శక్తి స్థాయిలు పెరుగుతాయి.
ఆరోమాథెరఫీ ఫాలో అవ్వడం వల్ల ఒత్తిడి, మానసిక అలసట తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది. దీంతో శక్తి పెరిగిన ఫీల్ వస్తుంది. ఆరోమాథెరఫీ కోసం లావెండర్ ఆయిల్ వాడితే మేలు.
ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండే స్నాక్స్ తినడం వల్ల శక్తి పెరుగుతుంది. బాదం గింజలు లేదా యాపిల్ తింటే మేలు.
కాసేపు ఎండలో నిల్చోండి. దీని వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఏకాగ్రత రెట్టింపు అవుతుంది. శక్తి పెరుగుతుంది.
ప్రశాంతమైన మ్యూజిక్ వినడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. శక్తి పెరిగిన ఫీలింగ్ వస్తుంది.