
CM Chandrababu Yoga: ప్రస్తుత ఆధునిక సమాజంలో యువత విపరీతమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటోందని.. దానికి యోగా ఒక్కటే సరైన పరిష్కారమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు.
అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఉండవల్లి కొండల సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో పతంజలి యోగపీఠ్ వ్యవస్థాపకులు బాబా రామ్‌దేవ్‌తో కలిసి సీఎం చంద్రబాబు యోగాసనాలు వేశారు. రామ్‌దేవ్ బాబా శిక్షణలో జరిగిన ఈ యోగా సాధనను ఆయన ప్రత్యేకంగా తిలకించారు. యోగా అనేది మన పూర్వీకులు అందించిన సాంప్రదాయం, విజ్ఞానం మరియు అమూల్యమైన వారసత్వ సంపద అని చంద్రబాబు కొనియాడారు.