
ఇంటర్నెట్ డెస్క్: చాలా రోజుల తర్వాత అర్జున్ తన యాక్షన్‌తో మెప్పించిన చిత్రం ‘బ్లాస్ట్’ (Blast). ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
ఇప్పుడీ చిత్రం ఓటీటీ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా జూన్ 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. కొన్ని రోజులుగా దీని ఓటీటీ తేదీపై వార్తలు వస్తున్నప్పటికీ నేడు నెట్‌ఫ్లిక్స్ అధికారిక తేదీని వెల్లడించింది. సుభాష్ కె రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రీతీ ముకుందన్, అభిరామి, అర్జున్ చిదంబరం తదితరులు నటించారు.
నీల (ప్రీతీ ముకుందన్) ఓ మధ్యతరగతి అమ్మాయి. కరాటే స్పెషలిస్ట్. ఆమె తండ్రి రాజారామ్ (అర్జున్), తల్లి (అభిరామి) కూడా కరాటే మాస్టర్లే. ఆ కుటుంబం ఓ వైపు పిల్లలకు ఉచితంగా మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇస్తూనే.. మరోవైపు మెడికల్ షాప్‌ని నడుపుతూ జీవితాల్ని సాఫీగా సాగిస్తుంటుంది. నీల కూడా ఉద్యోగం చేసుకుంటూనే.. తండ్రికి చేదోడువాదోడుగా ఉంటుంది. అలా ఓరోజు ఆమె షాప్‌లో ఉండగా.. కృపాకర్ (పవన్) గ్యాంగ్‌కి చెందిన ఓ రౌడీ ఆమెను బెదిరించి కొన్ని మందులు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలోనే ఆమె చేతిలో చావుదెబ్బలు తిని కటకటాలపాలవుతాడు. కానీ, తాను అలా అరెస్ట్ అయ్యాక.. ఆ కృపాకర్ గ్యాంగ్‌తో పాటు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అబ్రహం (అర్జున్ చిదంబరం).. నీల కుటుంబాన్ని అంతం చేయాలని ప్రయత్నిస్తారు. మరి ఆ తర్వాత ఏమైంది? అసలు కృపాకర్ గ్యాంగ్.. నీల కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి వెనకున్న కారణమేంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.