
ఉండవల్లి: దేశానికి ఆధ్యాత్మిక హబ్‌గా ఆంధ్రప్రదేశ్ మారనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని రాజధాని అమరావతిలోని ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమం...
ఉండవల్లి: దేశానికి ఆధ్యాత్మిక హబ్‌గా ఆంధ్రప్రదేశ్ మారనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని రాజధాని అమరావతిలోని ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. రాందేవ్ బాబా శిక్షణలో జరుగుతున్న యోగా సాధనను తిలకించారు. ఈ సందర్భంగా వివిధ రకాల యోగా ప్రక్రియలను రాందేవ్ బాబా సీఎంకు వివరించారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. యోగాకు.. రాందేవ్ బాబా మంచి గుర్తింపు తీసుకొచ్చారన్నారు. యోగా సాధనతో ఆయన అద్భుతాలు సృష్టిస్తున్నారని కొనియాడారు. ఆయన శిక్షణలో యువత యోగాసనాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం సమాజంలో యువత చాలా ఒత్తిడితో ఉందన్న సీఎం.. ఆధ్యాత్మికతతో కూడిన సాంకేతికత చాలా అవసరమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 31శాతం ఉన్న పచ్చదనాన్ని 50 శాతానికి పెంచడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. రాందేవ్‌బాబా మాట్లాడుతూ.. అభివృద్ధి, విజన్ కలిగిన సీఎం.. చంద్రబాబు అని కితాబిచ్చారు. ప్రధాని వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా సీఎం కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.