
కేంద్ర ప్రభుత్వం దేశంలో రవాణా రంగాన్ని అత్యాధునిక స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టులను వేగంగా అమలు చేస్తోంది.
ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన ఏడు ముఖ్యమైన హైస్పీడ్ రైలు కారిడార్లలో మూడు ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించడం రాష్ట్రానికి ఒక గొప్ప అవకాశమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.కేంద్రం తెలంగాణాకు ఇచ్చిన వరాలను ప్రకటించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు, ప్రయాణీకుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ విషయాన్ని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో జరిగిన ఒక కార్యక్రమంలో కిషన్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర రోడ్డు మరియు మౌలిక సదుపాయాల నిధి కింద రూ. 87 కోట్లతో చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు .మూడు బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ లపై ప్రాధమిక అంచనా హైదరాబాద్ నుంచి పుణె, బెంగళూరు, చెన్నై వరకు నిర్మించనున్న ఈ మూడు బుల్లెట్ రైలు మార్గాలు దాదాపు రూ. 5లక్షల కోట్ల ఖర్చుతో రూపొందనున్నట్లు ప్రాథమిక అంచనాలు వెల్లడయ్యాయి. ఈ ప్రాజెక్టులు అమలులోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌తో పొరుగు రాష్ట్రాల ప్రధాన నగరాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయి. ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. దీని ద్వారా వ్యాపార, వాణిజ్య రంగాలు ప్రగతి బాటలో నడుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.గ్రామీణ రహదారులకు కేంద్రం అదనపు రూ. 100 కోట్ల నిధుల మంజూరుఅంతేకాకుండా, రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి, సమగ్ర అభివృద్ధి వేగం పుంజుకుంటుంది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మరో ముఖ్యమైన ప్రకటన చేశారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అనుసంధానాన్ని మెరుగుపరచడానికి కేంద్రం అదనపు రూ. 100 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. నగరాల అభివృద్ధితో పాటు గ్రామీణ మౌలిక సదుపాయాలు కూడా సమానంగా ముఖ్యమని, దీని ద్వారా రాష్ట్రం సర్వతోముఖంగా ముందుకు సాగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో 2492 గ్రామాలలో ప్రజలకు మంచివార్త.. మీకోసమే ఈ ఫ్రీ హెల్త్ స్క్రీనింగ్!దేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రంగాహైదరాబాద్‌ఈ రకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించి, ఉద్యోగ అవకాశాలు సృష్టించి, రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటును మరింత పెంచుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా బుల్లెట్ రైళ్లు వంటి అత్యాధునిక రవాణా వ్యవస్థలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌ను దేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి.ఈ ప్రాజెక్టుల అమలు ద్వారా తెలంగాణ భవిష్యత్తులో ఒక మోడల్ స్టేట్‌గా ఎదగడానికి బలమైన పునాది ఏర్పడుతోంది.