రాజు గాడు ఎక్కడ ఉన్నాడో ఏమో.. ఈ లక్కీ గాడికి అన్నీ తెలుస్తాయి.. వాడినే అడుగుదాం పదా అని లక్ష్మీ, చలపతి అనుకుంటారు. ఈ ఐశ్వర్య ఏంటి.. మొన్నటి వరకు బాగానే ప్రేమగా మాట్లాడింది..
ఇప్పుడు అసలు ఫోనే లిఫ్ట్ చేయడం లేదు.. అని లక్కీ గాడు అనుకుంటూ ఉంటాడు. ఇంతలో చలపతి, లక్ష్మీ వస్తారు. మీరెందుకు వచ్చారు బాబాయి.. చెప్తే నేనే వచ్చేవాడ్ని కదా అని అంటాడు లక్కీ. నువ్వు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు కదా? అందుకే మేం వచ్చాం అని చలపతి అంటాడు. మా రాజు గాడు ఎక్కడున్నాడో చెప్పు రా అని చలపతి అడుగుతాడు. నాక్కూడా తెలీదు.. చాలా రోజుల నుంచి నేను కూడా ఫోన్ ట్రై చేస్తున్నా.. అని చలపతితో లక్కీ అబద్దం చెబుతాడు. రేయ్ ఇవన్నీ నేను నమ్మను రా.. మీ ఇద్దరూ తోడు దొంగలు.. నీకు చెప్పకుండా వాడు ఏం చేయడు.. మర్యాదగా వాడు ఎక్కడ ఉన్నాడో చెప్పురా అని చలపతి అడుగుతాడు. నిజం బాబాయి వాడు ఎక్కడ ఉన్నాడో నాక్కూడా తెలీదు.. నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు.రాజు జాడ కనుక్కున్న చలపతి.. వాడితో మాట్లాడి చాలా రోజులు అవుతుంది.. అని లక్కీ అంటాడు. సరిగ్గా అదే టైంకి రాజు నుంచి ఫోన్ వస్తుంది. అరే మీరు ఇలా వచ్చారు.. రాజు నుంచి కాల్ వస్తోంది అని మాట తిప్పేస్తాడు లక్కీ. లౌడ్ స్పీకర్లో పెట్టి మాట్లాడు అని చలపతి అంటాడు. పార్టీ స్టార్ట్ అయింది.. ఎక్కడున్నావ్ రా త్వరగా రా అని చెప్పేసి కట్ చేస్తాడు రాజు. ఆ పార్టీ అడ్రెస్ నాకు చెప్పురా.. లేదంటే చంపేస్తా అని లక్కీకి వార్నింగ్ ఇస్తాడు. దీంతో లక్కీ గాడు తప్పదా బాబాయ్ అని అంటాడు. తప్పదు.. లొకేషన్ పంపు అని అంటాడు. దీంతో ఆ ఇద్దరూ పార్టీ జరిగే ప్లేస్‌కి వెళ్లడానికి బయల్దేరుతారు.రేఖ స్పీచ్.. పార్టీలో రేఖ స్పీచ్ ఇస్తుంది. ఈ సంస్థని సీతా రామయ్య గారు స్థాపించారు.. రాజ్ కావ్యలు గొప్ప స్థాయికి తీసుకు వెళ్లారు.. కానీ ప్రమాదవశత్తు వారంతా మనల్ని విడిచి వెళ్లారు.. తప్పని పరిస్థితుల్లో నేను బాధ్యతల్ని తీసుకున్నాను.. ఇన్నేళ్లు కంపెనీని ముందుండి నడిపించానర.. కావ్య పోలికలతో ఉన్న ఇందుని ఇప్పుడు సీఈవోని చేస్తున్నాను.. ఇకపై అన్ని బాధ్యతలు ఇందునే చూసుకుంటుంది.. ఇందునే మన కొత్త సీఈవో అని రేఖ స్పీచ్ ఇస్తుంది. భలే నటిస్తోంది కదా అని రేఖ గురించి భ్రమరం అనుకుంటుంది. అన్నీ తెలిసిన నేనే ఎమోషనల్ అవుతున్నా అని భూషణ్ అంటాడు.ఇందు స్పీచ్‌కి అంతా ఫిదా.. నన్ను సీఈవో చేసిన మా రేఖ ఆంటికి ధన్యవాదాలు.. మా అమ్మానాన్నలానే నేను కూడా సంస్థను ముందుండి నడిపిస్తాను.. అని ఇందు అంటుంది. మీకు అనుభవం లేదు కదా? ఇన్వెస్టర్లు ప్రశ్నిస్తారు. మా రేఖ ఆంటి నుంచి అన్నీ నేర్చుకున్నాను.. ఏం చేయాలి.. ఏం చేయకూడదు.. ఎలా ఉండాలి.. ఎలా ఉండకకూడదు అన్నీ నేర్చుకున్నాను అని ఇందు చెబుతుంది. నన్ను నమ్మండి.. నేను కంపెనీని ముందుండి నడిపిస్తాను అని ఇందు అంటుంది. దీంతో ఓ ఇన్వెస్టర్ తమ మనసులోని మాట చెబుతాడు. రేఖ వచ్చిందని నేను ఈ కంపెనీతో బిజినెస్ చేయడం లేదు.. మీరు కంటిన్యూగా ఉంటానంటే నేను కూడా కంటిన్యూగా బిజినెస్ చేస్తానని అంటాడు. దీంతో ఓ డీల్ వచ్చిందని భూషణ్ ఖుషీ అవుతాడు.పార్టీలో చలపతి, లక్ష్మీ.. పార్టీ జరగే ప్లేస్‌కి చలపతి, లక్ష్మీ వస్తారు. ఇదేంటి ఇంత పెద్దగా ఉంది.. ఇల్లు ఇంత పెద్దగా ఉంది.. ఇక్కడ మన వాడు ఉంటాడా? అని అటూ ఇటూ చూస్తుంటారు. ఇంతలో అపర్ణా దేవీ వీళ్లని గమనిస్తుంది. వీరికి ఇందు, రాజుల పెళ్లి గురించి తెలీదు కదా అని అనుకుంటుంది. ఇక వారిని అక్కడ కూర్చోమని చెప్పి.. రాజుకి అసలు విషయం చెబుతుంది. మీ అమ్మానాన్న వచ్చారు.. వాళ్లకి నేను ఏ సంగతి కూడా చెప్పలేదు.. మీ పెళ్లి అయిందని వాళ్లకు తెలీదు అని నాకు తెలుసు.. అని అపర్ణ అంటుంది. సరే అమ్మమ్మ నేను చూసుకుంటాను లే అని రాజు వెళ్లిపోతాడు.అబద్దాలు చెప్పిన రాజు.. మీరేంటి ఇక్కడకు వచ్చారు అని చలపతి, లక్ష్మీలతో రాజు అంటాడు. నీకోసం.. నిన్ను వెతుక్కుంటూనే వచ్చాం అని అంటారు. నువ్వేంటి ఇక్కడ ఉన్నావ్.. ఆ అమ్మాయి ఏంటి ఇక్కడుంది.. అసలేం జరుగుతోంది రా అని ప్రశ్నిస్తాడు చలపతి. అంటే వీళ్లకి నిజం తెలీదన్న మాట అని రాజు కూల్ అవుతాడు. నేను, ఇందు కలిసి బిజినెస్ చేస్తున్నాం.. ఇదొక బిజినెస్ పార్టీ.. ఇందులో మేం ఓ డీల్ చేసుకోవడానికి వచ్చాం.. పార్టీ అవ్వగానే వెళ్లిపోతాం అని రాజు అబద్దాలు చెబుతాడు. ఇవన్నీ మనకు ఎందుకు రా అని చలపతి అంటాడు.కన్న తల్లిదండ్రులతో మాట్లాడలేనంత చిన్నోడు ఇంటికి కోసం కష్టపడుతున్నాడు.. ఇవన్నీ వదిలేసి నువ్వు కూడా రా రా.. మాతో పాటే ఉండు.. ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకో అని చలపతి అంటాడు. నేను బిజినెస్ మాత్రమే చేస్తాను అని రాజు అంటాడు. ముందు మీరు వెళ్లండి.. అని రాజు అంటాడు. కనీసం ఫోన్ అయినా చేయరా అని చలపతి అంటాడు. ఈ మధ్య బిజీగా ఉన్నాను అందుకే కుదర్లేదు అని రాజు అంటాడు. కన్న తల్లిదండ్రులతో మాట్లాడలేనంత బిజీగా ఉన్నావా రా అని లక్ష్మీ ఎమోషనల్ అవుతుంది. అలా చలపతి, లక్ష్మీ వెళ్లిపోతారు. ఇదంతా రేఖ గమనిస్తుంది. కానీ రేఖకు ఏదో ఒకటి చెప్పి అక్కడి నుంచి తీసుకు వెళ్తాడు రాజు. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.