
ఈనాడు, అమరావతి: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీల ప్రక్రియలో కీలక అడుగుపడింది.
విభజన చట్టం ప్రకారం శాశ్వత ప్రాతిపదికన తెలంగాణకు వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేసిన ఏపీలో పని చేస్తున్న 891 మంది ఉద్యోగుల జాబితాను ఏపీ ప్రభుత్వం.. తెలంగాణకు పంపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏపీ సీఎస్ లేఖ రాశారు. తదుపరి చర్యలు చేపట్టేందుకు త్వరితగతిన పరిశీలించి, సమ్మతి తెలియచేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ విజ్ఞప్తి చేసింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తే ఉద్యోగుల శాశ్వత బదిలీల ప్రక్రియ పూర్తవుతుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.