
ఈనాడు డిజిటల్, అనకాపల్లి: ‘నా చదువు, కట్టు, బొట్టుపై విమర్శలు చేసే ముందు మీ ఇంట్లో ఆడవాళ్లను గుర్తు తెచ్చుకోవాలి’ అని వైకాపా నేతలను ఉద్దేశించి హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు.
ముస్తాబు కావడం తప్పా అని ప్రశ్నించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు వద్ద ఓ కన్వెన్షన్లో శుక్రవారం నిర్వహించిన కూటమి రెండేళ్ల పాలన విజయోత్సవ సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. ‘నాపై ఎవరు వెకిలిగా మాట్లాడినా, అవమానించినా పట్టించుకోను. వైకాపా పాలనలో నన్ను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి, నిర్బంధాలకు గురిచేశారు. నన్ను ఇన్నిరకాలుగా అవమానించినందుకు నాకున్న పదవితో వారిపై కేసులు పెట్టొచ్చు.. కానీ ఏనాడు అలా చేయలేదు’’అని అనిత అన్నారు.
ఎన్ని రకాలుగా విమర్శలుచేసి, ఇబ్బందులు పెట్టినా ప్రజలకోసం ఓర్పుగా ఉంటానని, వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని అనిత స్పష్టం చేశారు. తనకు రాజకీయాలు కేవలం ఎన్నికల వరకేనని, ఆ తర్వాత పరిపాలనపైనే దృష్టి ఉంటుందని వివరించారు. పథకాలు, అభివృద్ధి అనేది పార్టీలకతీతంగా చేసి చూపించానన్నారు. గడిచిన రెండేళ్ల కాలంలో ఏనాడూ పైసా అవినీతి చేయలేదని, ఇలా చెప్పాలంటే ధైర్యం ఉండాలన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.