
ఇంటర్నెట్ డెస్క్: శివసేన (యూబీటీ)లో కొందరు ఎంపీలు తిరుగుబాటు ప్రయత్నాలు చేస్తున్న వేళ ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు.
పార్టీ ఫిరాయించిన ఎంపీలకు గత ఎన్నికల్లో ఓటు వేసిన ప్రజలకు తన తరఫున క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. ముంబయిలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. తనపై విశ్వాసం లేకుంటే పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగేందుకు సైతం సిద్ధంగా ఉన్నానని చెప్పారు. దేశం ‘వన్ పార్టీ.. నో ఎలక్షన్స్’ అనే దిశగా పయనిస్తోందని.. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు.
తమకు కాంగ్రెస్తో తీవ్రమైన రాజకీయ విభేదాలు ఉన్నా.. భాజపా చేస్తున్నట్లుగా శివసేన (యూబీటీ)ని నాశనం చేయడానికి ఆ పార్టీ ఎప్పుడూ ప్రయత్నించలేదని ఉద్ధవ్ పేర్కొన్నారు. 30ఏళ్ల పొత్తు తర్వాత కూడా తాము భాజపాలో విలీనం కాలేదని.. అటువంటిది, కాంగ్రెస్లో ఎందుకు విలీనమవుతామని ప్రశ్నించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.