
ABVP calls for telangana schools bandh: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27,000 ప్రభుత్వ పాఠశాలల్లో 23,000 పాఠశాలలను మూసివేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో ఏబీవీపీ సీరియస్ అయ్యింది.
వెంటనే ఈ నిర్ణయంను వెనక్కు తీసుకొవాలని డిమాండ్ చేసింది.
తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్లు ఇటీవల ప్రారంభం అయ్యాయ. సోమవారం రోజు జూన్ 15న అమావాస్య మూలంగా చాలా మంది విద్యార్థులు బడికి హజరు కాలేదు. ఇక జూన్ 17 నుంచి విద్యార్థులు రెగ్యులర్ గా బడిబాట పట్టారు.
ఈ క్రమంలో స్కూళ్లు తెరుకున్న నేపథ్యంలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మౌళిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27,000 ప్రభుత్వ పాఠశాలల్లో 23,000 పాఠశాలలను మూసివేయాలన్న ప్రకనటపై ఏబీవీపీ సీరియస్ గా తీసుకుంది. దీనిపై నిరసనను తెలియజేస్తు జూన్ 23న తెలంగాణ వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చింది.
ముఖ్యంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు, ఖాళీల భర్తీ, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ, ఎన్ఈపీ 2020 అమలు చేయాలని ఏబీవీపీ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. అంతేకాకుండా..రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27,000 ప్రభుత్వ పాఠశాలల్లో 23,000 పాఠశాలలను మూసివేయాలన్న సీఎం వ్యాఖ్యల్ని ఖండించింది.
ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకొవాలని, దీనితో పాటు అలాగే అధిక ఫీజుల పెంపు ద్వారా తల్లిదండ్రులను దోచుకుంటున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో స్కూళ్లను మూసి వేస్తే పేద, నిరుపేద విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలోకి వెళ్తుందని ఏబీవీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా.. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో అధిక ఫీజులపై చర్యలు తీసుకొవాలని ఏబీవీపీ కోరింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని కోరింది. ప్రైవేట్ పాఠశాలల నుంచే పుస్తకాలను తప్పనిసరిగా కొనుగోలు చేయడం, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం వంటి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఏబీవీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.