
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
19 Years Boy Organ Donation: ముంబైకి చెందిన 19 ఏళ్ల కాలేజీ విద్యార్థి రాజ్ గాంధీ.. తాను మరణిస్తూ కూడా ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు. ఈ విధంగా అవయవదానంపై అవయవదానంపై జీ మీడియా (Zee Media) కల్పించిన అవగాహన ఇప్పుడు మరింత మంది ఇళ్లలో ఆనందాన్ని తీసుకురావాలని వీలు కల్పించింది. జీ మీడియా స్ఫూర్తితో రాజ్ పెద్ద సోదరుడు మిటెన్ గాంధీ పంచుకున్న ఆనాటి విషాద, స్ఫూర్తిదాయక జ్ఞాపకాలు ఇప్పుడు మీ కోసం..
ఆ ఒకే ఒక్క రాత్రి.. అది 2017, మే 18వ తేదీ సాయంత్రం.. ముంబైలోని మసీద్ స్టేషన్ సమీపంలో ఉన్న తన మామయ్య ఆఫీసులో పని ముగించుకుని రాజ్ లోకల్ ట్రైన్లో ఇంటికి బయలుదేరాడు. రాత్రి 8 గంటలవుతున్నా రాజ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతడికి పదే పదే ఫోన్ చేశారు. చివరకు అతని ఫోన్ ఎత్తిన పోలీసులు.. రాజ్ రైలు ప్రమాదానికి గురై ఇక లేడనే వార్తలను తెలియజేశారు.
రైలులో విపరీతమైన రద్దీ కారణంగా తోపులాట జరిగి, రాజ్ అదుపుతప్పి కదులుతున్న రైలు నుండి కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అతన్ని వెంటనే ముంబైలోని లీలావతి ఆసుపత్రి ICUలో చేర్పించారు. వైద్యులు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ రాజ్ ఆరోగ్యం క్షీణిస్తూనే వచ్చింది.
దుఃఖంలోనూ వెలుగులు నింపాడు.. మే 21, 2017న రాజ్ 'బ్రెయిన్ డెడ్' (మెదడు పూర్తిగా పనిచేయడం ఆగిపోవడం) అయినట్లు వైద్యులుధృవీకరించారు. ఆ నిమిషంలో గాంధీ కుటుంబంపై కొండంత దుఃఖం వచ్చిపడింది. అయినప్పటికీ, ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసే గుణమున్న రాజ్ జ్ఞాపకార్థం.. అతని అవయవాలను దానం చేయాలని కుటుంబం నిర్ణయించుకుంది.
మొదట్లో అవయవాల దుర్వినియోగంపై కొన్ని అపోహలు ఉన్నప్పటికీ.. ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన కౌన్సిలర్లు భారతదేశంలో అవయవ దాన ప్రక్రియ అంతా చట్టబద్ధంగా, పారదర్శకంగా (ZTCC వెయిటింగ్ లిస్ట్ ప్రకారం) జరుగుతుందని వివరించడంతో తల్లిదండ్రులు నవీన్‌చంద్ర గాంధీ, నీలా గాంధీ ధైర్యంగా ముందుకు వచ్చారు.
ఆరుగురికి ప్రాణం పోశాడు.. ఇది రైలు ప్రమాదం కావడం వల్ల మెడికో-లీగల్ కేసుగా నమోదైంది. అయినప్పటికీ పోలీసులు, ఆసుపత్రి యాజమాన్యం వేగంగా స్పందించి అనుమతులు మంజూరు చేశారు. ఈ క్రమంలో రాజ్‌కు చెందిన గుండె, కాలేయం, మూత్రపిండాలు, కళ్లు వంటి వాటిని ఆరుగురికి దానం చేశారు కుటుంబసభ్యులు.
"రాజ్ భౌతికంగా మన మధ్య లేకపోయినా, అతని గుండె చప్పుడు కారణంగా మరొకరి కుమారుడు, సోదరుడు లేదా తండ్రి ఈ రోజు బతికి ఉన్నారనే విషయమే మాకు పెద్ద ప్రశాంతత" అంటూ రాజ్ సోదరుడు మిటెన్ భావోద్వేగానికి గురయ్యారు.
జీ మీడియా విజ్ఞప్తి.. "జిందగీ కే బాద్ భీ" భారతదేశంలో ప్రతిఏటా లక్షలాది మంది సరైన సమయానికి అవయవాలు అందక ప్రాణాలు కోల్పోతున్నారు. తీవ్ర దుఃఖంలో ఉండి కూడా ఒక కుటుంబం తీసుకునే సాహసోపేత నిర్ణయం.. మరెన్నో కుటుంబాల్లో వెలుగులు నింపగలదని రాజ్ గాంధీ కథ నిరూపించింది. జీ మీడియా అవగాహన ప్రచారం "జిందగీ కే బాద్ భీ" (Zindagi Ke Baad Bhi) లో భాగస్వాములు అవ్వండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.