
ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ కోల్‌కతాలో పలు...
ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ కోల్‌కతాలో పలు రంగాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఈవీ, పునరుత్పాదక ఇంధనం, ఉక్కు, ఆగ్రో-ప్రాసెసింగ్ వంటి కీలక రంగాల్లో రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని వారికి విజ్ఞప్తి చేశారు.భవిష్యత్ సాంకేతికత, హరిత ఇంధనంపై దృష్టిహిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ సీఎండీ అనురాగ్ చౌదరితో భేటీ అయిన మంత్రి లోకేశ్, రాష్ట్రంలో సిలికాన్-కార్బన్ యానోడ్ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. "దక్షిణ భారతదేశ ఈవీ తయారీ కారిడార్‌కు ఏపీని కీలక సరఫరాదారుగా మార్చాలన్నది మా సంకల్పం. నెల్లూరు లేదా చిత్తూరు ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లలో మీ యూనిట్ ఏర్పాటు చేయండి" అని లోకేశ్ ప్రతిపాదించారు. దీనితో పాటు, ఐఐటీ తిరుపతి లేదా ఆంధ్రా యూనివర్సిటీ భాగస్వామ్యంతో అమరావతిలో ఒక అధునాతన మెటీరియల్ ల్యాబ్‌ను స్థాపించాలని సూచించారు.అలాగే, విక్రమ్ సోలార్ చైర్మన్ జ్జానేష్ చౌదరి, సీఈఓ అరుణ్ మిట్టల్‌తో సమావేశమై రాయలసీమలో ఇంటిగ్రేటెడ్ సోలార్ హబ్ ఏర్పాటు చేయాలని లోకేశ్ కోరారు. "రాబోయే ఐదేళ్లలో 78.5 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించడం, రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, 7.5 లక్షల ఉద్యోగాలు సృష్టించడం మా ధ్యేయం" అని ఆయన వివరించారు. రిలయన్స్, ఎస్ఏఈఎల్ వంటి సంస్థలు ఇప్పటికే రాయలసీమలో భారీ సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.ఉక్కు, అల్యూమినియం పరిశ్రమలకు ఆహ్వానంరాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన,