
తెలంగాణ రాష్ట్రాన్ని క్షయ వ్యాధి రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ స్థాయిలో కార్యాచరణ చేపట్టింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈ అంశంపై ప్రభుత్వ చర్యలను కేంద్రానికి తెలియజేశారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని తెలంగాణలో అమలవుతున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాలను వివరించారు.రాష్ట్రంలోని 2492 గ్రామాల్లో హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమాలురాజీవ్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయం నుంచి మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొన్న ఈ సమావేశంలో క్షయ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించారు.
రాష్ట్రంలోని 2492 గ్రామాల్లో హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనుమానితులందరికీ ఎక్స్-రే, తెమడ పరీక్షలు చేసి వ్యాధిని త్వరగా గుర్తించి చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.క్షయ వ్యాధి బాధితులకు పోషకాహారం గా ఫుడ్ బాస్కెట్ క్షయ వ్యాధి బాధితులకు కేవలం మందులు మాత్రమే కాకుండా పోషకాహార సపోర్ట్ కూడా అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం నిక్షయ పోషణ యోజన కింద నెలకు వేయి రూపాయలు అందించినప్పటికీ, తెలంగాణలో అదనంగా ఫుడ్ బాస్కెట్ ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. ఇలా ప్రభుత్వం బాధితుల పక్కన నిలబడి వారి పూర్తి ఆరోగ్య రక్షణకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.మాతా శిశు మరణాలు తగ్గించేలా సమగ్ర వ్యూహం మాతా-శిశు సంరక్షణపై కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
మాతృ మరణాలు, నవజాత శిశు మరణాలను తగ్గించడానికి సమగ్ర వ్యూహం అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర బాల సంక్షేమ కార్యక్రమం ద్వారా 0-18 ఏళ్ల పిల్లలందరికీ హెల్త్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామని వివరించారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్య సంరక్షణలో మరింత ముందుజాగ్రత్త చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు.హైదరాబాద్ యువతను వేధిస్తున్న కొత్త సమస్య – పాతికేళ్ల వయసులోనే ఆ ముప్పు!హైరిస్క్ ప్రెగ్నెన్సీలపై అలెర్ట్ హైరిస్క్ ప్రెగ్నెన్సీలను ముందుగానే గుర్తించి, బర్త్ ప్లానింగ్ ద్వారా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన
తెలంగాణ రాష్ట్రాన్ని క్షయ వ్యాధి రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ స్థాయిలో కార్యాచరణ చేపట్టింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈ అంశంపై ప్రభుత్వ చర్యలను కేంద్రానికి తెలియజేశారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని తెలంగాణలో అమలవుతున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాలను వివరించారు.రాష్ట్రంలోని 2492 గ్రామాల్లో హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమాలురాజీవ్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయం నుంచి మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొన్న ఈ సమావేశంలో క్షయ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలోని 2492 గ్రామాల్లో హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనుమానితులందరికీ ఎక్స్-రే, తెమడ పరీక్షలు చేసి వ్యాధిని త్వరగా గుర్తించి చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.క్షయ వ్యాధి బాధితులకు పోషకాహారం గా ఫుడ్ బాస్కెట్ క్షయ వ్యాధి బాధితులకు కేవలం మందులు మాత్రమే కాకుండా పోషకాహార సపోర్ట్ కూడా అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నిక్షయ పోషణ యోజన కింద నెలకు వేయి రూపాయలు అందించినప్పటికీ, తెలంగాణలో అదనంగా ఫుడ్ బాస్కెట్ ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. ఇలా ప్రభుత్వం బాధితుల పక్కన నిలబడి వారి పూర్తి ఆరోగ్య రక్షణకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.మాతా శిశు మరణాలు తగ్గించేలా సమగ్ర వ్యూహం మాతా-శిశు సంరక్షణపై కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మాతృ మరణాలు, నవజాత శిశు మరణాలను తగ్గించడానికి సమగ్ర వ్యూహం అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర బాల సంక్షేమ కార్యక్రమం ద్వారా 0-18 ఏళ్ల పిల్లలందరికీ హెల్త్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామని వివరించారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్య సంరక్షణలో మరింత ముందుజాగ్రత్త చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు.హైదరాబాద్ యువతను వేధిస్తున్న కొత్త సమస్య – పాతికేళ్ల వయసులోనే ఆ ముప్పు!హైరిస్క్ ప్రెగ్నెన్సీలపై అలెర్ట్ హైరిస్క్ ప్రెగ్నెన్సీలను ముందుగానే గుర్తించి, బర్త్ ప్లానింగ్ ద్వారా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. గర్భిణీలకు నాలుగు సార్లు యాంటీ నేటల్ చెకప్ విధిగా నిర్వహిస్తున్నామని, సికిల్ సెల్, తలసేమియా వంటి జన్యు రుగ్మతలు, హైపర్ టెన్షన్, డయాబెటిస్, థైరాయిడ్ వంటి సమస్యలను ముందస్తుగా గుర్తించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.