
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ మరాఠీ దర్శకుడు ప్రవీణ్ తార్డే తెరకెక్కించిన ‘దేవూల్ బంద్ 2’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. కేవలం రూ.8 నుంచి 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ. 81.78 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరబోతోంది. మరాఠీ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచింది. అయితే, ఈ సినిమా ఎలాంటి ఆటంకాలు లేకుండా థియేటర్లలోకి రావడానికి షారుఖ్ ఖానే (Shah Rukh Khan) ముఖ్య కారణమని దర్శకుడు ప్రవీణ్ తార్డే తాజాగా వెల్లడించారు.
ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘‘ఈ సినిమాను డిజిటల్ ప్రొజెక్టర్లపై ప్రదర్శించడానికి డిజిటల్ సినిమా ప్యాకేజీ (డీసీపీ) చేయించాల్సి వచ్చింది. దీనికోసం మేం షారుఖ్ సంస్థ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్’ను సంప్రదించాం.
అప్పుడు మా వద్ద కేవలం రూ.12 లక్షలే ఉన్నాయి. బిల్లు అంచనా రూ.42 నుంచి రూ.45 లక్షల వరకు వచ్చింది. అంత డబ్బు చెల్లించే స్తోమత లేకపోవడంతో మా పరిస్థితిని రెడ్ చిల్లీస్ ప్రతినిధులకు వివరించాం. వారి ద్వారా ఈ విషయం షారుఖ్ దృష్టికి వెళ్లింది.
నా ‘ముల్షీ ప్యాటర్న్’ చిత్రం గురించి ఆయనకు ముందే తెలుసు. దీంతో ఆయన మమ్మల్ని పిలిచారు. మా సినిమా ఎమోషనల్‌గా చాలా బాగుందని ఆయన బృందం చెప్పడంతో, షారుఖ్ వెంటనే ఆ బిల్లును మాఫీ చేయించారు. ‘అది మరాఠీ సినిమా.. వారికి ముందు డీసీపీ ఇచ్చేయండి.
డబ్బుల విషయం తర్వాత చూసుకుందాం’ అని తన సిబ్బందితో చెప్పారు. సినిమా హిట్ అవుతుందో, లేదో తెలియని సమయంలో, ఎలాంటి గ్యారెంటీ లేకుండా షారుఖ్ చేసిన ఈ గొప్ప సాయాన్ని నేనెప్పటికీ మరిచిపోలేను. షారుఖ్ ఖాన్‌కు ప్రత్యేకంగా ఈ సినిమాను ప్రదర్శించి చూపిస్తాను.
ఆయనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని ప్రవీణ్ తార్డే తెలిపారు. అయితే
, 2015లో వచ్చిన ‘దేవూల్ బంద్’ చిత్రానికి ఇది సీక్వెల్. స్నేహల్ తార్డే, మోహన్ జోషీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం.. రైతుల ఆత్మహత్యలు, విశ్వాసం-నాస్తికత్వం అనే అంశాల చుట్టూ సాగుతుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి నిర్మాత. కయాదు లోహర్ కథానాయిక. మోహన్‌బాబు, రాఘవ్ జుయల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
విరాట్ కర్ణ కథానాయకుడిగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘నాగబంధం’ (Nagabandham). నభా నటేశ్, ఐశ్వర్య మేనన్ కథానాయికలు.