
టాలీవుడ్ హీరో నితిన్ (Nithiin) గత కొన్నేళ్లుగా ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. కానీ, ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయాడు.
టాలీవుడ్ హీరో నితిన్ (Nithiin) గత కొన్నేళ్లుగా ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. కానీ, ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయాడు. గతేడాది రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలతో ప్రేక్షకుల ముందకు వచ్చినా ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. అయినా పట్టువదలని విక్రమార్కుడులా మంచి హిట్ కోసం కష్టపడూతూనే ఉన్నాడు. అందులో భాగంగానే సితార ఎంటర్ టైన్మెంట్స్ లో నితిన్ ఒక సినిమా చేస్తున్నాడు. కొత్త డైరెక్టర్ నారి సిరిస్వాద, సోమశేఖర్ టి దర్శకులుగా పరిచయం అవుతున్నారు.
నితిన్ 43 గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఈమధ్యనే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ సినిమాలో నితిన్ సరసన రితికా నాయక్ నటిస్తోంది. మిరాయ్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. టాలీవుడ్ కి లక్కీ బ్యూటీగా మారింది. దీంతో నితిన్ ఈసారి మంచి హిట్ నే అందుకుంటాడు అనుకున్నారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. రితికా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ అయ్యేవరకు ఎవరు ఉంటారో ఎవరో పోతారో చెప్పడం చాలా కష్టం. ఇక సినిమా మొదలైన కొన్ని రోజులుకే నితిన్ సినిమా నుంచి రితికా తప్పుకుందంట. ఇప్పుడు ఆమె ప్లేస్ ని బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య రీప్లేస్ చేయనుందని సమాచారం. కథలో జరిగిన కొన్ని మార్పులు, డేట్ల అడ్జస్ట్మెంట్స్ కారణంగా రితికా తప్పుకోవడంతో ఆ ఛాన్స్ బేబీ పట్టేసిందని అంటున్నారు. ఏదిఏమైనా వైష్ణవికి ఇది పెద్ద ప్రాజెక్టు అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందని సమాచారం. మరి ఈ సినిమాతో నితిన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.