
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Man tortures his wife beaten forced to drink urine in Koriya Chhattisgarh: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై దాడుల మాత్రం ఆగడంలేదు. ప్రతి రోజు మహిళలపై అఘాయిత్యాలు, హత్యలకు చెందిన ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి.
మరోవైపు భార్యభర్తల ఘటనలు కూడా ఇటీవల ఆందోళనలు కల్గిస్తున్నాయి. కొన్ని చోట్ల భర్త తన భార్యను చంపుతుంటే, మరికొన్ని చోట్ల భార్య తన భర్తను పొట్టన పెట్టుకుంటుంది. వీరి ప్రవర్తన మొత్తంగా వివాహ వ్యవస్థను ప్రశ్నార్థకంగా మార్చేస్తుంది.
కొంత మంది వివాహేతర సంబంధాలు, ఆర్థిక పరమైన గొడవలతో పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. మరికొంత మంది డైవర్స్ లు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక భర్త తన భార్యపై అనుమానంతో ఆమె పట్ల సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని కొరియాజిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే తార, జితేంద్ర ఘాసియా అనే దంపతులకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి నలుగురు పిల్లలు. కొన్ని నెలల క్రితం భార్యభర్తల మధ్య అనుమానం అనే భూతం వల్ల గొడవలు కావడంతో ఇద్దరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.
అప్పటి నుంచి ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. తార ఎవరితో మాట్లాడిన భర్త అనుమాన పడేవాడు. ఈ క్రమంలో భర్త వేధింపులు భరించలేక తార సపరేట్ గా ఉంటుంది. ఈ క్రమంలో తనను కాదని మరో వ్యక్తితో ఉంటుందని తెలుసుకున్న జితేంద్ర ఘాసియా
ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ తన బంధువులతో కలసి తారను ఇంట్లో నుంచి బైటకు లాక్కొని వచ్చాడు. అందరు చూస్తుండగా, తన పిల్లల ఎదుట దారుణంగా కొట్టాడు. జుట్టును కట్ చేసేసి, ఆమె ముఖంకు బూడిద పూశాడు. అంతటితో ఆగకుండా ఆమెతో మూత్రంను కూడా తాగించేందుకు ప్రయత్నించాడు.
అక్కడున్న వారు ఎవరు కూడా అతగాడ్ని ఆపే సాహాసం చేయడంలేదు. ఈ ఘటనను దూరం నుంచి వీడియో తీస్తు ఉండిపోయారు. ఆ తర్వాత అతగాడు అక్కడ నుంచి వెళ్లిపోయాక తార స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనపై జరిగిన దారుణంపై ఫిర్యాదు చేసింది. తనపై గతంలో కూడా వివాహేతర సంబంధం అంటకట్టాడని, తాగి వచ్చి నిత్యం వేధించేవాడని చెప్పింది. పలుమార్లు హత్యకు కూడా ప్రయత్నించాడని చెప్పి ఆ మహిళ కన్నీళ్లు పెట్టుకుంది.
Read more: Anantapur Rs 20 note Viral: దేవుడా.. మా అత్త తొందరగా చచ్చిపోవాలి.. రూ. 20 నోట్‌పై కోడలి రిక్వెస్ట్..అసలు స్టోరీ ఏమిటంటే..?
ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. జితేంద్రపై కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారంగా మారింది. దీనిపై నెటిజన్లు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకమహిళను పట్టుకుని అంతలా కొడుతున్న కనీసం ఒక్కరు కూడా ఆపేందుకు ప్రయత్నించలేదని ఇదేనా మానవత్వం అంటూ ఫైర్ అవుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.