
‘కంచె’తో కుర్రాళ్లను ఆకట్టుకొని.. బాలయ్యతో హాట్రిక్ చిత్రాలు చేసి పాపులారిటీ తెచ్చుకున్న నటి ప్రగ్యా జైస్వాల్. తాజాగా ఆమె ఫొటోషూట్‌కు సంబంధించిన పోస్టులు సోషల్‌మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
ప్రగ్యా పోస్టు చేసే చాలా ఫొటోలకు నటి రకూల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ లైక్ కొడుతుండటం విశేషం.
ప్రగ్యా ఇన్‌స్టా ఖాతా ఓపెన్ చేస్తే ఫోటోషూట్స్తోపాటు విహారయాత్రలో దిగిన ఫొటోలే ఎక్కువగా కనిపిస్తుంటాయి.
విహార యాత్రలు చేయడం ప్రగ్యాకు అలవాటు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో తరచూ విదేశాలకు వెళ్లి వస్తుంటుంది.
మాల్దీవుల్లో సేద తీరడం ఈ భామకు చాలా ఇష్టం. వీలు చిక్కితే రెక్కలు కట్టుకొని అక్కడ వాలిపోతుంది.
గత ఫిబ్రవరిలో బెహ్రెయిన్‌కు వెళ్లింది. పర్యాటక ప్రాంతాలన్నీ చుట్టేసి.. ఆ విశేషాలను ఇన్‌స్టాలో పంచుకుంది.
వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడి సంస్కృతి, జీవనశైలిని తెలుసుకోవడం చాలా గొప్పగా అనిపిస్తుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
ఫ్యామిలీతో వెళ్తే పర్యాటక ప్రాంతాలు మాత్రమే చూడగలం.. ఫ్రెండ్స్‌తో వెళ్తే సాహస క్రీడలు, షికారులు చాలా ఉంటాయని తెలిపింది.
విమర్శలు ఓకే.. బాగా ట్రోల్ చేస్తే బ్లాక్ చేస్తా!