తెలంగాణలో జనసేన, కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ సభకు అనుమతులు ఇవ్వకపోవడంతో ప్రారంభమైన ఆగ్రహజ్వాల.. రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది.
తెలంగాణ ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా.. కాంగ్రెస్ నేతలు కూడా పవన్ కళ్యాణ్, జనసేనలను తూర్పారా పడుతున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా తెలంగాణలో ప్రతిపక్షాల కంటే ఎక్కువగా జనసేన పార్టీ రాజకీయ వార్తల్లో నిలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్ మణికొండలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించగా.. కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది.ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ..
పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వచ్చినా.. కమల కళ్యాణ్ వచ్చినా బాధ లేదని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్‌కు ఎవరితో ఎలాంటి సమస్య ఉందో దాంతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు.
తెలంగాణకు సామరస్యంగా వస్తే తమ ఇంటికి పిలిచి మరీ భోజనాలు పెట్టిస్తానని పేర్కొన్న మహేష్ కుమార్ గౌడ్.. రాజకీయాలు చేస్తామంటే మాత్రం నడవనీయమని తేల్చి చెప్పారు.ఇక ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమిలో భాగంగా ఉన్న జనసేన.. తెలంగాణలో కూడా పార్టీని పటిష్ఠం చేయాలని నిర్ణయించుకుంది.
త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు రానుండగా.. జనసేన పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఇప్పటికే ప్రకటించిన పవన్ కళ్యాణ్.. ఆ దిశగా తెలంగాణలో జనసేన కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. జూన్ 2వ తేదీన సభకు అనుమతి లేకపోవడంతో ప్రెస్‌మీట్ పెట్టి..
ప్రతీసారి విమర్శల దాడిని పెంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన సేన ప్రస్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. ఆ తర్వాత అరుదైన వ్యాధితో బాధపడుతున్న తన అభిమాని నిరంజన్.. తనను కలవాలి అని ఉందనే చివరి కోరికను నెరవేర్చేందుకు హనుమకొండలో పర్యటించి.. నిరంజన్ ఇంటికి వెళ్లి అతడిని పరామర్శించారు. తాజాగా మణికొండలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి.. తెలంగాణపై పూర్తి ఫోకస్ పెట్టినట్లు హింట్ ఇచ్చారు. తెలంగాణలో జనసేన పార్టీ ఉనికిని చాటుకునేందుకు.. క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను బలోపేతం చేస్తామని ప్రకటించిన పవన్.. అవసరం అయితే తానే రంగంలోకి దిగుతానని తేల్చి చెప్పారు. దీంతో తెలంగాణ జనసేన నేతల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.
తీవ్ర వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత సందర్భం వచ్చిన