
జన సేన పార్టీ తమ నూతన తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని 2026 జూన్ 19, శుక్రవారం హైదరాబాద్ లోని మణికొండలో ప్రారంభించింది. పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ఈ కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు, సహా తెలంగాణ లో పార్టీని బలోపేతం చేయడానికి, కార్యకలాపాలను విస్తరించడానికి ఈ నూతన కార్యాలయం కీలకంగా మారనుంది.
తెలంగాణలో జనసేన పార్టీ తమ కార్యకలాపాలను ముమ్మరం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో పార్టీకి ప్రత్యేక కార్యాలయం లేనందున, సమావేశాలు పవన్ కల్యాణ్ నివాసంలో లేదా ఇతర ప్రదేశాల్లో జరిగేవి. ఈ నూతన కార్యాలయం ఏర్పాటుతో పార్టీ సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల సమన్వయానికి ఒక కేంద్రం అందుబాటులోకి వచ్చింది.
ఇటీవల తెలంగాణ అవతరణ దినోత్సవం వేళ జనసేన సభకు తెలంగాణలో అనుమతి లభించని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రెస్మీట్ ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్.. తాను తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేస్తానని ప్రకటించారు.
తాజాగా కార్యాలయం ఏర్పాటుతో ఆ దిశగా అడుగులు పడుతున్నట్లే కనిపిస్తోంది. హైదరాబాద్లోని మణికొండలో, మల్కం చెరువు సమీపంలో ఉన్న నూతన కార్యాలయాన్ని శుక్రవారం ఉదయం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.
కార్యాలయంలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ వేడుకలకు పార్టీ ముఖ్య నాయకులు, పీఏసీ సభ్యులు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జనసైనికుల కోలాహలంతో మణికొండ ప్రాంతం సందడిగా మారింది. తెలంగాణ రాజకీయాలపై పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు.
రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో, ఈ కొత్త కార్యాలయం పార్టీ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా నిలుస్తుంది. తెలంగాణ ప్రజలకు జనసేన మరింత చేరువ కావడానికి, రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేయడానికి, సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించడానికి ఈ కార్యాలయం దోహదపడుతుందని పార్టీ శ్రేణులు వెల్లడించాయి.
పార్టీ భవిష్యత్తు కార్యకలాపాలకు ఈ నూతన కార్యాలయం ఒక కీలకమైన అడుగుగా భావిస్తున్నారు. ఇది రాష్ట్రంలో పార్టీకి మరింత గుర్తింపును, కార్యాచరణ స్వేచ్ఛను అందిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణలో జనసేన