అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో యార్లుంగ్ త్సంగోపో (బ్రహ్మపుత్ర) నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోఎలక్ట్రిక్ డ్యామ్ నిర్మాణాన్ని పొరుగు దేశం చైనా అధికారికంగా చేపట్టింది. చైనా డ్యామ్ నిర్మాణానికి ధీటుగా బదులిచ్చేందుకు భారత్ కూడా వడివడిగా అడుగులు వేస్తోంది.
ఇందులో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌లో అప్పర్ సియాంగ్, సియాంగ్ జిల్లాలో ప్రవహించే సియాంగ్ నదిపై 11వేల మెగవాట్ల విద్యుత్ ఉత్పతి సామర్థ్యం, వరద నివారణ కోసం భారీ ‘సియాంగ్ అప్పర్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్’ను భారత్ ప్రతిపాదించింది. ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ గనుక పూర్తయితే దేశంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్ట్‌గా అవతరిస్తుంది.
సుమారు 13 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.5 లక్షల కోట్లు) వ్యయంతో నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏడాదికి 47 బిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా.ఈ రెండు ప్రాజెక్టులను పోల్చి చూస్తే భారత్ ఎదుర్కొంటున్న సవాల్ ఎంత క్లిష్టమైందో అర్థమవుతోంది. చైనా 60,000 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చురుకుగా సాగుతుండగా..
SUMP ఇంకా ప్రాథమిక సాధ్యాసాధ్యాల అధ్యయన దశలోనే ఉంది. చైనా ప్రాజెక్ట్.. SUMP సామర్థ్యాన్ని మించి ఉంటుందని నివేదికలు వస్తున్నాయి. వివాదాస్పద నది విషయంలో బీజింగ్ ప్రతి కదలికను నిశితంగా గమనిస్తూనే, భారత్ ఇప్పుడు తన వ్యూహాత్మక ప్రతిస్పందనను వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తోంది.యార్లంగ్ త్సాంగ్పో నది, సియాంగ్ నదిగా భారత భూభాగంలోకి ప్రవేశించి, బ్రహ్మపుత్ర నదిగా విస్తరిస్తుంది.
ఇది అరుణాచల్ ప్రదేశ్, అసోంలోలోని లక్షలాది మందికి జీవనాధారం. ఎగువన ఇంతటి భారీ ఆనకట్ట నిర్మాణం నీటి ప్రవాహాలను మార్చివేయడమే కాకుండా, స్థానిక పర్యావరణ వ్యవస్థలను నాశనం చేసి, వ్యవసాయాన్ని అతలాకుతలం చేస్తుందని, అనూహ్యమైన వరదలను సృష్టిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ విషయమై లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్రం..
నిశితంగా గమనిస్తున్నామని స్పష్టం చేసింది. దిగువ ప్రాంతాల ప్రజల ప్రాణాలను, జీవనోపాధిని రక్షించడానికి అవసరమైన ముందస్తు, నివారణ చర్యలను తీసుకుంటామని హామీ ఇచ్చింది. సరిహద్దులు దాటి ప్రవహించే నదులపై ఇలాంటి ప్రాజెక్టుల విషయంలో పారదర్శకత పాటించాలని, సమాచారాన్ని పంచుకోవాలని, ముందస్తు సంప్రదింపులు జరపాలని భారత్ నిరంతరం బీజింగ్‌పై ఒత్తిడి తెస్తుంది. కానీ, ఇప్పటివరకు చైనా నుంచి ఆశించిన స్థాయిలో ప్రతిస్పందన రాలేదు.విద్యుత్ ఉత్పత్తి మాత్రమే కాకుండా.. వర్షాకాలంలో దిగువన సంభవించే వరదలను నియంత్రించడానికి, ఎగువ మళ్లింపుల వల్ల కలిగే ముప్పు నుంచి భారత భూభాగాలను రక్షించడానికి SUMP ప్రత్యేకంగా రూపొందించారు. ఈ రెండు కారణాలతో ప్రాజెక్ట్ ఆర్థిక విలువతో పాటు భౌగోళిక రాజకీయ ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతుంది. మరోవైపు, ఈలోగా ఎదురయ్యే ప్రమాదాలను ఎదుర్కోవడానికి, ఈశాన్య రాష్ట్రాల్లో వరద ముందస్తు అంచనా వ్యవస్థలు, నదీ పర్యవేక్షణ నెట్‌వర్క్‌లు, మౌలిక సదుపాయాలను ఏకకాలంలో బలోపేతం చేస్తోంది.
బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతంలో చైనా జలవిద్యుత్ ప్రాజెక్ట్ సహా అన్ని కార్యకలాపాలను