
‘బాస్’ అనే మాట వినగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది ఒత్తిడి, టార్గెట్లు, మందలింపులే. సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా చెడ్డ బాస్‌ల కథలే కనిపిస్తుంటాయి. ప్రతి పనిలో జోక్యం చేసుకోవడం, ఉద్యోగుల మాట వినకపోవడం, ప్రశంసించకపోవడం లాంటి ఫిర్యాదులు తరచూ వినిపిస్తుంటాయి.కానీ అందరూ అలానే ఉంటారా?
అస్సలు కాదు. కొంతమంది లీడర్స్ తమ టీమ్‌ను కేవలం ఉద్యోగులుగా కాకుండా కలిసి పని చేసే పార్ట్‌నర్స్‌గా చూస్తారు. అవసరమైనప్పుడు అండగా నిలుస్తారు. ఎదగడానికి ప్రోత్సహిస్తారు. అలాంటి బాస్ దొరికితే ఉద్యోగ జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది.
మరి మీ బాస్ కూడా అలాంటి వారిలో ఒకరేనా? తెలుసుకోవాలంటే ఈ ఐదు లక్షణాలు గమనించండి.1. మీ మాట కూడా వింటారుచాలామంది బాస్‌లు మాట్లాడతారు. కానీ మంచి నాయకుడు మాత్రం వింటాడు. మీకు ఏదైనా కొత్త ఆలోచన వచ్చినా, సమస్య ఎదురైనా, అభిప్రాయం చెప్పాలనిపించినా ఓపిగ్గా వింటే అది మంచి సంకేతం.
ఉద్యోగుల మాటకు విలువ ఇచ్చే నాయకులు సాధారణంగా మంచి టీమ్‌లను నిర్మిస్తారు.2. ప్రతి నిమిషం పర్యవేక్షించరుమీరు పని చేస్తున్నప్పుడు ప్రతి ఐదు నిమిషాలకు ఫోన్ చేయడం, మెసేజ్ పెట్టడం, అప్డేట్ అడగడం చాలా మందికి విసుగు తెప్పిస్తుంది.
మంచి బాస్ మాత్రం బాధ్యత అప్పగిస్తాడు. పని ఎలా చేయాలో చెబుతాడు. ఆ తర్వాత మీపై నమ్మకం ఉంచుతాడు. అవసరమైతేనే జోక్యం చేసుకుంటాడు. దీంతో ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.3. ఉద్యోగమే జీవితం కాదని అర్థం చేసుకుంటారుఆఫీస్ బయట కూడా ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుంది.
కుటుంబం ఉంటుంది. ఆరోగ్యం